Home> జాతీయం
Advertisement

దాడి చేస్తే అక్కడే కాల్చిపారేయండని పోలీస్ కమిషనర్ ఆదేశాలు

రాత్రి వేళ పెట్రోలింగ్ విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది తమ వెంట రైఫిల్ తీసుకెళ్లాలని సూచించారు బెంగుళూరు పోలీసు కమిషనర్ టి సునీల్ కుమార్.

దాడి చేస్తే అక్కడే కాల్చిపారేయండని పోలీస్ కమిషనర్ ఆదేశాలు

రాత్రి వేళ పెట్రోలింగ్ విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది తమ వెంట రైఫిల్ తీసుకెళ్లాలని సూచించారు బెంగుళూరు పోలీసు కమిషనర్ టి సునీల్ కుమార్. గత నెల రోజుల్లో ఆరు ఘటనల్లో పెట్రోలింగ్ విధుల్లో వున్న పోలీసు సిబ్బందిపై దాడులు జరగడాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు కమిషనర్ టీ సునీల్ కుమార్.. ఇకపై విధులలో వుండగా ఎవరైనా తమపై దాడికి పాల్పడటానికి ప్రయత్నిస్తే, తీవ్రంగా స్పందించాల్సిందిగా చెప్పారు. అవసరమైతే వెంటనే తమ తుపాకీకి పనిచెప్పమని పోలీసు సిబ్బందికి తేల్చిచెప్పారు. గురువారం అర్థరాత్రి దాటాకా జీవన్ భీమానగర్‌లో పెట్రోలింగ్ విధుల్లో వున్న మహిళా ఎస్సై ఆర్ అశ్వినితో నలుగురు యువకులు తప్పతాగి గొడవకు దిగడమేకాకుండా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన నేపథ్యంలో పోలీసు కమిషనర్ శనివారం ఈ ఆదేశాలు జారీచేశారు. 

మహిళా ఎస్సైని వేధించిన కేసులో నలుగురు యువకులని అక్కడే అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అరెస్ట్ అయిన యువకులు నలుగురూ 22 నుంచి 26 ఏళ్ల మధ్య వయస్సు వారే. చాలా చోట్ల బార్లు అర్ధరాత్రి తర్వాత కూడా తెరిచి వుంచడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అభిప్రాయపడిన కమిషనర్.. ఇకపై ఆలస్యంగా మూసే బార్లపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకి స్పష్టంచేశారు.  

Read More