Home> జాతీయం
Advertisement

Shiv Sena: ఉద్ధవ్ ఠాక్రే నుంచి శివసేన చేయి జారిపోతోందా..సుప్రీం కోర్టు ఏమన్నాదంటే..!

Shiv Sena: శివసేన సంక్షోభానికి తెరపడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు షాక్‌ తగినట్లు అయ్యింది.

Shiv Sena: ఉద్ధవ్ ఠాక్రే నుంచి శివసేన చేయి జారిపోతోందా..సుప్రీం కోర్టు ఏమన్నాదంటే..!

Shiv Sena: దేశ సర్వోన్నత న్యాయ స్థానంలో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు ఎదురుదెబ్బ తగినట్లు కనిపిస్తోంది. సీఎం ఏక్‌నాథ్‌ షిందే చేసిన వినతిని పరిశీలించేందుకు ఎన్నిక సంఘానికి అనుమతి ఇచ్చింది. తమ వర్గానే అసలైన శివసేనగా గుర్తించాలని షిందే వర్గం కోరుతోంది. ఠాక్రే, శిందే వర్గాల్లో ఎవరిది అసలైన శివసేన అనేది ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుందని తేల్చి చెప్పింది. దీంతో సీఎం పీఠాన్ని కోల్పోయిన ఉద్దవ్ ఠాక్రేకి షాక్‌ తగినట్లు అయ్యింది.

మహారాష్ట్రలో అనూహ్య పరిణామాల మధ్య శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్‌ షిందే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారు. ఐతే శివసేన పార్టీ ఎవరిదన్న దానిపై పోరు కొనసాగుతోంది. ఠాక్రే, శిందే వర్గాలు తమదంటే తమది అంటూ న్యాయ పోరాటం చేస్తున్నాయి. ఈనేపథ్యంలోనే సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

సుప్రీం కోర్టు పచ్చ జెండా ఊపడంతో శివసేన ఎవరిదన్న దానిపై త్వరలో క్లారిటీ రానుంది. ఉద్దవ్ ఠాక్రే నుంచి శివసేన చేయి జారినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ మెజార్టీ ప్రజాప్రతినిధులంతా ఏక్‌నాథ్‌ షిందే వైపు ఉన్నారు. తమకు సంపూర్ణ మెజార్టీ ఉందని మొదటి నుంచి షిందే వర్గం చెబుతోంది. తమదే అసలైన శివసేన అని స్పష్టం చేస్తున్నారు. శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి దగ్గర నుంచి ఆ పార్టీలో ముసలం కొనసాగుతోంది.

ఇటీవల అది బహిర్గతం అయ్యింది. అప్పటి సీఎం, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు ఎగురవేశారు. వీరంతా గోవాలోని రిసార్ట్‌కు తరలి వెళ్లారు. అక్కడి నుంచే పావులు కదిపారు. దీంతో సీఎం పదవికి ఠాక్రే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ముంబై చేరుకున్న ఏక్‌నాథ్‌ షిందే వర్గం..బీజేపీతో సంప్రదింపులు జరిపింది. అనంతరం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి.

అతి తక్కువ సమయంలోనే ఇదంతా జరిగిపోయింది. త్వరలో శివసేన పార్టీ సైతం ఠాక్రే నుంచి జారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐతే ఆయన వర్గం మాత్రం పట్టుదలతో ఉంది. తమదే అసలైన శివసేన అని అంటున్నారు. తామే శివసైనికులమని స్పష్టం చేస్తున్నారు.

Also read:Durga Matha Idol vandalised: బుర్ఖాల్లో వచ్చి దుర్గా మాత విగ్రహంపై దాడి, మండపానికి నిప్పు

Also read:IND vs SA: రేపటి నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్..టీమిండియా జట్టు ఇదిగో..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More