Home> జాతీయం
Advertisement

Shirdi sai temple devotee rush : భక్తికి బంద్ అడ్డంకి కాదు

మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. భగవత్ సాయినాథున్ని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఇవాళ షిరిడీలో బంద్ కొనసాగుతోంది. ఐనప్పటికీ భక్తికి బంద్ అడ్డం కాదంటూ లక్షలాది మంది భక్తులు షిరిడీ సాయినాథున్ని దర్శించుకుంటున్నారు.

Shirdi sai temple devotee rush : భక్తికి  బంద్ అడ్డంకి కాదు

మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. భగవత్ సాయినాథున్ని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఇవాళ షిరిడీలో బంద్ కొనసాగుతోంది. ఐనప్పటికీ భక్తికి బంద్ అడ్డం కాదంటూ లక్షలాది మంది భక్తులు షిరిడీ సాయినాథున్ని దర్శించుకుంటున్నారు. మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా ఆలయానికి విశిష్ట ప్రాధాన్యం ఉంది. ఏడాది పొడవునా కోట్లాది మంది భక్తులు సాయినాథున్ని దర్శించుకుని తమ కోరికలు నెరవేర్చుకుంటారు. సాయిబాబా పుణ్యదర్శనం ద్వారా తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. 

fallbacks
షిరిడీ సాయిబాబా ఆలయాన్ని షిరిడి సంస్థాన్ నిర్వహిస్తోంది. తాజాగా షిరిడీ సాయిబాబా ఆలయానికి సంబంధించి ఓ వివాదం వచ్చి పడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే షిరిడీ సాయిబాబా పుట్టిన ఊరు పత్రి అంటూ వ్యాఖ్యానించారు. అంతే కాదు అక్కడ షిరిడి సాయిబాబాకు ఆలయం నిర్మించేందుకు 100 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని షిరిడీ సంస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. షిరిడీ సాయిబాబా స్వస్థలం షిరిడీయేనని వాదిస్తోంది. దీంతో వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా షిరిడీ సంస్థాన్ ఈ రోజు (ఆదివారం) షిరిడీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో షిరిడీ సంస్థాన్‌కు సంఘీభావం ప్రకటించారు. భారీ సంఖ్యలో షిరిడీ సాయినాథున్ని దర్శించుకుని తమ మద్దతు తెలియజేశారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More