Home> జాతీయం
Advertisement

భార్య సమ్మతి లేకుండా శృంగారంలో పాల్గొనడం నేరం కాదు: గుజరాత్ హైకోర్టు

గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.

భార్య సమ్మతి లేకుండా శృంగారంలో పాల్గొనడం నేరం కాదు: గుజరాత్ హైకోర్టు

గాంధీనగర్: గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. భార్య సమ్మతి లేకుండా లైంగికచర్యలో పాల్గొనడం అత్యాచారం చేయడం కిందకు రాదని గుజరాత్ తీర్పునిచ్చింది. 18ఏళ్ళ వయసు నిండిన భార్య సమ్మతి లేకుండానే ఆమెతో భర్త లైంగికచర్యలో పాల్గొనడం అత్యాచారం చేయడం కిందకు రాదని పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం లైంగిక చర్యలో పాల్గొనడం అత్యాచార నేరంగా పరిగణించలేమని గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ పార్థివాకా తన తీర్పులో పేర్కొన్నారు.

అయితే భర్త భార్యపై అసహజ శృంగారానికి పాల్పడితే ఐపీసీ సెక్షన్ 377 కింద కేసు పెట్టవచ్చని జడ్జి పేర్కొన్నారు. భార్యను లైంగికంగా వేధించడం, పశువులా లైంగిక చర్యకు పాల్పడటం నేరమని, ఐపీసీ సెక్షన్ 377 కిందకు వస్తుందని జడ్జి పేర్కొన్నారు. ఒక మహిళా డాక్టర్ తన భర్తపై ఓరల్ సెక్స్, అసహజ శృంగారం, వరకట్న వేధింపుల కేసు పెట్టింది. భర్త కూడా వైద్యుడే.

లేడీ డాక్టర్ పిటీషన్ పై స్పందించిన కోర్టు, ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం అసహజ శృంగారానికి పాల్పడ్డ భర్తపై చర్యలు తీసుకోవచ్చని కోర్టు తెలిపింది. గత తీర్పులను పరిగణలోకి తీసుకున్న  జస్టిస్ పార్థివాకా, భర్త చట్టబద్దమైన భార్యతో శృంగారంలో పాల్గొనడానికి హక్కు ఉంది. ఆ సమయంలో భార్య దానిని సొంత ఆస్తిగా భావించరాదు. అయితే వేధింపులు, వరకట్న అంశాలను క్రిమినల్ చర్యలుగా కోర్టు భావిస్తుందన్నారు.
లేడీ డాక్టర్ ఫిర్యాదుపై విచారణను కొనసాగించాలని కోర్టు నిర్ణయించింది. అయితే భర్త తల్లితండ్రుల కేసును తిరస్కరించింది. కోర్టు తిరస్కరిస్తే ఈ కేసును సిఐడి లేదా సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.

Read More