Home> జాతీయం
Advertisement

AstraZeneca Vaccine: భారత్‌లో కూడా ఆక్స్‌ఫర్డ్ టీకా ట్రయల్స్‌కు బ్రేక్

ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్ (Coronavirus) వ్యాక్సిన్ ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే చివరి దశ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్న ఓ వాలంటీర్‌కు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో దీనిని నిలిపివేస్తున్నట్లు ఆక్స్‌ఫర్ట్ పేర్కొంది.

AstraZeneca Vaccine: భారత్‌లో కూడా ఆక్స్‌ఫర్డ్ టీకా ట్రయల్స్‌కు బ్రేక్

Oxford vaccine trials pausing in India: ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్ (Coronavirus Vaccine) వ్యాక్సిన్ ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే చివరి దశ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్న ఓ వాలంటీర్‌కు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో దీనిని నిలిపివేస్తున్నట్లు ఆక్స్‌ఫర్ట్ పేర్కొంది. ఈ క్రమంలో ట్రయల్స్ నిలిపివేతపై.. టీకా ఉత్పత్తి భాగస్వామ్య కంపెనీ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇండియా(SII) సంస్థ స్పందించి.. బ్రిటన్‌లో ట్రయల్స్ నిలిపివేశారని.. అయితే.. భారత్‌లో ప్రయోగాలు మాత్రం కొనసాగుతాయని పేర్కొంది. అయితే గురువారం భారత్‌లో కూడా ఆస్టాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్స్‌ను నిలిపివేస్తున్నట్లు సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. Also read: Astrazeneca vaccine: ఇండియాలో పరీక్షలు కొనసాగుతున్నాయి: సీరమ్

డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) సూచనల మేరకు కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను నిలిపివేస్తున్నట్లు ఎస్ఐఐ తెలిపింది. ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తున్నామని.. ఆస్ట్రాజెనెకా ట్రయల్స్ పున:ప్రారంభించే వరకు భారతదేశంలో ప్రయోగాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో భారత్‌లో చేపడుతున్న క్లినికల్ ట్రయల్స్‌ గురించి వివరణ ఇవ్వాలని  సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇండియాను  డీసీజీఐ వివరణ కోరగా.. ఈ నిర్ణయం తీసుకుంటూ ప్రకటనను విడుదల చేసింది. Also read: AstraZeneca Vaccine: ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్‌ తాత్కాలికంగా నిలిపివేత 

Read More