Home> జాతీయం
Advertisement

Serum Institute: కేంద్ర ప్రభుత్వ విదేశీ వ్యాక్సిన్ విధానంపై సీరమ్ కీలక వ్యాఖ్యలు

Serum Institute: విదేశీ వ్యాక్సిన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సీరమ్ ఇనిస్టిట్యూట్ తప్పుబట్టింది. వ్యాక్సిన్ తయారీదారులందరికీ నిబంధనలు ఒకేలా ఉండాలని సూచించింది. లండన్ నుంచి అదార్ పూణావాలా ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

కోవిడ్ వ్యాక్సిన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం(Central government) కీలక నిర్ణయాలు తీసుకుంది. 2021 డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో  విదేశీ వ్యాక్సిన్లపై ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసే క్రమంలో అనుమతి పొందిన విదేశీ వ్యాక్సిన్లకు ఇండియాలో ట్రయల్స్ అవసరం లేదని తెలిపింది. వ్యాక్సిన్ ట్రయల్స్ సందర్భంగా ఏదైనా జరిగితే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని..న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని విదేశీ కంపెనీలైన ఫైజర్, మోడెర్నాలు కోరాయి. ఇదే విషంయలో ఇండెమ్నిటి బాండ్ ఇవ్వాలని కూడా కోరాయి. ఈ అంశాలకు కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఓకే చెప్పింది.

ఈ విషయంపైనే సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ అదార్ పూణావాలా(Adar Poonawalla) స్పందించారు. వ్యాక్సిన్ తయారీదారులందరికీ నిబంధనలు ఒకేలా ఉండాలని కోరారు. నష్టపరిహారం విషయంలో విదేశీ సంస్థలు రక్షణ పొందితే సీరమ్ ఇనిస్టిట్యూట్‌తో పాటు అన్ని దేశీయ కంపెనీలకు వర్తింపజేయాలని తెలిపారు.

Also read: India Corona Cases Today: ఇండియాలో మరోసారి తగ్గిన కోవిడ్19 మరణాలు, మెరుగ్గా డిశ్ఛార్జ్ కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More