Home> జాతీయం
Advertisement

రోహింగ్యాలపై దయచూపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు

రోహింగ్యాలపై దయచూపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు

మోడీ సర్కార్ కు సుప్రీం షాక్ మరో షాకు తగింలింది.రోహింగ్యాల దుస్థితిపై కేంద్ర ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాలని ఆదేశించింది.  జాతీయ భద్రత, శరణార్థుల సమస్యను ఎదుర్కొనే విషయంలో సమతూకం పాటించాల్సిలని ధర్మాసనం సూచించింది. అమాయక రోహింగ్యా మహిళలు, చిన్నారుల దుస్థితిని కోర్టు చూసీచూడకుండా వదిలేయలేయబోదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రోహింగ్యాల విషయంలో తాము నిర్ణయం తీసుకునే వరకు  దేశంలోని రోహింగ్యాలను డిపోర్ట్‌ చేయకూడదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. రోహింగ్యాలను పంపించే విషయంలో ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే..కోర్టును ఆశ్రయించవచ్చని కోర్టు పేర్కొంది. 

రోహింగ్యా శరణార్ధులపై శుక్రవారం విచారణ చేపట్టిన కోర్టు ..ఇరువైపు నుంచి వాదనలు విన్నంది. దేశంలోని రోహింగ్యాలు శరణార్థులు కాదని... వారు అక్రమ వలసదారులని కేంద్రం పేర్కొంది. రోహింగ్యాలు దేశభద్రతకు ముప్పుగా పరిణమించారని.. చట్టప్రకారం వారు దేశంలో నివసించడం కుదరదని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. శరణార్థుల తరఫున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదించారు. రోహింగ్యాల విషయంలో మానవతావాదన్ని పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని శరణార్థుల తరుఫను వాదనలు వినిపించారు. ఇరువైపుల నుంచి వాదనలు విన్న ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Read More