Home> జాతీయం
Advertisement

Remdesivir Injection prices: రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ధరల్లో భారీ తగ్గుదల, ఏ ఇంజక్షన్ ధర ఎంత

Remdesivir Injection prices: దేశవ్యాప్తంగా ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు చికిత్సలో కీలకమైన రెమ్‌డెసివర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపధ్యంలో రెమ్‌డెసివిర్ తాజా ధరలు ఇలా ఉన్నాయి..

Remdesivir Injection prices: రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ధరల్లో భారీ తగ్గుదల, ఏ ఇంజక్షన్ ధర ఎంత

Remdesivir Injection prices: దేశవ్యాప్తంగా ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు చికిత్సలో కీలకమైన రెమ్‌డెసివర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపధ్యంలో రెమ్‌డెసివిర్ తాజా ధరలు ఇలా ఉన్నాయి..

దేశంలో కరోనా మొదటి వేవ్ కంటే రెండవ వేవ్ (Corona Second Wave)ప్రమాదకరంగా మారుతోంది. రోజులు 2 లక్షల పై చిలుకు కేసులు దేశవ్యాప్తంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా గత 24 గంటల్లో అయితే 2 లక్షల 60 వేల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆక్సిజన్ సిలెండర్లు, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లకు భారీ కొరత ఏర్పడింది. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లైతే బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయింది. 4 వేల 5 వందలున్న ఒక్కొక్క ఇంజక్షన్ 12 వేల నుంచి 13 వేల వరకూ పలుకుతోంది.

ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ( Central government) జోక్యం చేసుకుని..రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల ధరల్ని(Remdesivir Injections Prices)తగ్గించాలని కోరింది. దాంతో కొన్ని ఫార్మా కంపెనీలు స్వచ్ఛంధంగా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ధరల్ని తగ్గించుకున్నాయని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ తెలిపింది. మరోవైపు రెమ్‌డెసివిర్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని 28 లక్షల్నించి 41 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. కోవిడ్ 19 చికిత్సలో సీరియస్‌గా ఉన్న రోగులకు రెమ్‌డెసివిర్ యాంటీ వైరల్ డ్రగ్ కీలకంగా మారింది. మారిన ధరల ప్రకారం పలు కంపెనీల ఇంజక్షన్ల ధరలిలా ఉన్నాయి.

క్యాడిలా హెల్త్‌కేర్ ఇంజక్షన్ ధర 2 వేల 8 వందల్నించి ఒక్కసారిగా 899 రూపాయలకు దిగింది. సింజెన్ ఇంటర్నేషనల్ ఇంజక్షన్ ధర 3 వేల 950 రూపాయల్నించి 2 వేల 450 రూపాయలకు మారింది. అటు రెడ్డి ల్యాబ్స్ ( Reddy Labs) రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ధర 5 వేల 4 వందల్నించి 2 వేల 7 వందలుగా మారింది. ఇక సిప్లా కంపెనీ ఇంజక్షన్ ధర 4 వేల నుంచి 3 వేలకు పడిపోయింది. మైలాన్ కంపెనీ ఇంజక్షన్ ధర 4 వేల 8 వందలుండగా..ఇప్పుడు 3 వేల 4 వందలకు తగ్గింది. జుబిలెంట్ ఫార్మా ఇంజక్షన్ ధర 4 వేల 7 వందల రూపాయల్నించి 3 వేల 4 వందలకు తగ్గించారు. ఇక హెటిరో ఫార్మా ( Hetero drugs) కు చెందిన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ధర 5 వేల 4 వందల్నించి  3 వేల 490 రూపాయలకు తగ్గింది.

Also read: COVID-19: కరోనా వైరస్ ఎంత సమయంలో వ్యాపిస్తుందో తెలుసా, నిపుణులు ఏం చెప్పారంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More