Home> జాతీయం
Advertisement

గృహిణులకు శుభవార్త: భారీగా తగ్గిన వంట గ్యాస్ ధరలు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్న ఈ తరుణంలో గృహిణులకు చమురు కంపెనీలు శుభవార్తను అందించాయి. నాన్‌ సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ల ధరను రూ 35.50 మేర ఆయిల్‌ కంపెనీలు తగ్గించాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను తగ్గించడం ఇది రెండవసారి. వాణిజ్య సిలిండర్లకు మాత్రమే ప్రస్తుత తగ్గింపు వర్తించనుంది. తగ్గిన ధరలు ఆదివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.

గృహిణులకు శుభవార్త: భారీగా తగ్గిన వంట గ్యాస్ ధరలు

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్న ఈ తరుణంలో గృహిణులకు చమురు కంపెనీలు శుభవార్తను అందించాయి. నాన్‌ సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ల ధరను రూ 35.50 మేర గ్యాస్ కంపెనీలు తగ్గించాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను తగ్గించడం ఇది రెండవసారి. వాణిజ్య సిలిండర్లకు మాత్రమే ప్రస్తుత తగ్గింపు వర్తించనుంది. తగ్గిన ధరలు ఆదివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.

తాజా తగ్గింపుతో 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.54 వరకూ దిగిరాగా, 5 కిలోల చిన్న ఎల్‌పీజీ సిలిండర్‌ రూ.15 తగ్గింది. కాగా ప్రతియేటా ప్రతి కుటుంబానికి 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్లను 12 వరకూ సమకూర్చుతున్నారు. ఈ పరిమితిని దాటిన వినియోగదారులు మార్కెట్‌ రేటు అంటే నాన్‌ సబ్సిడీ కింద గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

నాలుగేళ్ల గరిష్టానికి పెట్రోల్, డీజిల్ ధరలు

మరోవైపు.. ఆదివారం పెట్రోల్‌తో పాటు డీజిల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఢిల్లీలో  లీటర్ పెట్రోల్ ధర రూ.73.73 రూపాయలు ఉండగా.. డీజిల్ ధర రూ.64.58గా ఉంది. గత నాలుగు సంవత్సరాలతో పోల్చుకుంటే ఇదే అత్యధిక ధర కావడం విశేషం. ఎక్సైజ్‌ పన్నును తగ్గించాలని ఇప్పటికే డీలర్లు మొర పెట్టుకుంటున్నా.. అవి తగ్గకపోగా.. చమురుధరలు పెరగడంతో ఇప్పుడు ఆ పరిశ్రమలో అయోమయం నెలకొంది. ఒకప్పుడు నెలవారీ ధరకు సంబంధించిన సమీక్షలు ఉండేవని.. ఇప్పుడు రోజువారీ సమీక్షలు ఉంటున్నాయని.. అందుకే స్టాక్ మార్కెట్ ధరల ప్రభావం కూడా చమురు ధరలపై పడుతుందని పలువురు నిపుణులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. తాజా సమాచారం ప్రకారం నెల్లూరు లాంటి ప్రాంతాల్లో లీటర్ రూ.80 రూపాయలు దాటడం,  వైజాగ్ లాంటి ప్రాంతాల్లో రూ.79 రూపాయలు దాటడం గమనార్హం. తెలంగాణలో మాత్రం రూ.69 రూపాయలు దాటినట్లు సమాచారం.

కేంద్రం 2017 అక్టోబర్‌లో లీటరుకు రెండు రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఆ సమయంలో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.70.88, డీజిల్ ధర రూ. 59.14గా ఉంది. ఎక్సైజ్ సుంకం తగ్గించిన తరువాత, అక్టోబర్ 4, 2017న, డీజిల్ ధర రూ .56.89‌గా, పెట్రోలు రూ.68.38గా ఉంది. అయితే, ముడి చమురు ధరలు పెరగడంతో, పెట్రోలు, డీజిల్ ధరలు ఇప్పుడు బాగా పెరిగాయి.

 

Read More