Home> జాతీయం
Advertisement

భారత్ తో మేము చర్చలకు సిద్దమే

భారత్ తో మేము చర్చలకు సిద్దమే

వివాదాస్పద సీపీఈసీ ప్రాజెక్ట్ (చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్)పై భారత్ తో తాము చర్చలకు సిద్ధమని చైనా స్పష్టం చేసింది. 50 బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ విషయంలో భారత్ కు ఉన్న అభ్యంతరాలను తెలుసుకొని.. వాటిని పరిష్కరిస్తామని చైనా విదేశాంగ ప్రతినిధి హువా చున్యింగ్ చెప్పారు. 

చైనాలో భారత రాయబారిగా ఉన్న గౌతమ్ బంబావాలే .. సీపీఈసీ విషయంలో చైనా, భారత్ మధ్య ఉన్న విభేదాలు అంత తేలిగ్గా కొట్టిపారేయలేమని అన్నారు. చైనా ఈ విషయంలో ఇప్పటికే తన వైఖరిని వెల్లడించిందని, రెండు దేశాల ప్రయోజనాల దృష్ట్యా.. ఈ సమస్య పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని చైనా తెలిపింది. వివాదాలను పక్కకుపెట్టి సమస్య మరింత జఠిలం కాకమునుపే రెండు దేశాలు పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవాలని చైనా పేర్కొంది. సమస్యను పరిష్కరించాలని ఒక దేశాన్ని కోరడం సరికాదు.. భారత్ తో కలిసి పనిచేయడానికి, చర్చించడానికి తాము సిద్దమే అని హువా తెలిపారు.  సీపీఈసీ అనేది ఆర్థిక సహకార ప్రాజెక్ట్. ఇది ఇతరులకు ఇబ్బంది కలిగించదు. భారత్ ఆ దిశగా ఆలోచించి.. చైనాతో మైత్రి కొనసాగించాలని ఆశిస్తున్నాం అని తెలిపారు.

Read More