Home> జాతీయం
Advertisement

RBI to Withdraw Rs 2000 Note: బడాబాబులకు మరోసారి షాకిచ్చిన కేంద్రం.. రూ. 2 వేల నోటు మళ్లీ వెనక్కి

RBI to Withdraw Rs 2000 Note: భారీ మొత్తంలో రూ. 2 వేల నోట్ల కట్టలను వెనకేసుకున్న బడా బాబులకు కేంద్రం మరోసారి షాకిచ్చింది. రూ. 2 వేల నోటును మళ్లీ వెనక్కి తీసుకుంటున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆర్బీఐ చేసిన ఈ సంచలన ప్రకటన దేశంలో మరోసారి ప్రకంపనలు సృష్టించింది. 

RBI to Withdraw Rs 2000 Note: బడాబాబులకు మరోసారి షాకిచ్చిన కేంద్రం.. రూ. 2 వేల నోటు మళ్లీ వెనక్కి

RBI to Withdraw Rs 2000 Note: భారీ మొత్తంలో రూ. 2 వేల నోట్ల కట్టలను వెనకేసుకున్న బడా బాబులకు కేంద్రం మరోసారి షాకిచ్చింది. రూ. 2 వేల నోటును మళ్లీ వెనక్కి తీసుకుంటున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆర్బీఐ చేసిన ఈ సంచలన ప్రకటన దేశంలో మరోసారి ప్రకంపనలు సృష్టించింది. 2 వేల రూపాయల నోట్ల కట్టలను జారీ చేయకూడదని పేర్కొంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి దేశంలోని అన్ని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. డిమానిటైజేషన్ తరువాత దేశంలో మళ్లీ ఇంతటి కలకలం రేపిన నిర్ణయం ఇదే కానుంది.

ఇప్పటికే సర్క్యులేషన్‌లో ఉన్న 2 వేల రూపాయల నోట్లను తమ తమ బ్యాంకు ఎకౌంట్స్‌లో డిపాజిట్ చేయడం కానీ లేదా మార్పిడి చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ పౌరులకు సూచించింది. రూ. 2000 నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 30 ని తుది గడువుగా కేంద్రం స్పష్టంచేసింది. కేంద్రం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

2000 నోట్లతో జనం తమ లావాదేవీలు చేసుకోవచ్చు, అలాగే ఇతరుల నుంచి చెల్లింపు కింద స్వీకరించవచ్చు అని తేల్చిచెప్పిన ఆర్బీఐ.. అలా స్వీకరించిన నోట్లను సెప్టెంబర్ 30వ తేదీలోగా బ్యాంకులో జమ చేయాల్సిందిగా స్పష్టంచేసింది. 

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లో రూ. 2 వేల నోట్ల డిపాజిట్స్, మార్పిడికి అనుమతించడం జరుగుతుంది అని ఆర్బీఐ వెల్లడించింది. అంతేకాకుండా దేశంలోని 19 ఆర్బీఐ రీజినల్ ఆఫీసుల్లోనూ 2000 రూపాయల నోట్ల డిపాజిట్స్, మార్పిడికి అనుమతించడం జరుగుతుంది అని ఆర్బీఐ వివరించింది.

బ్యాంకులో ఎకౌంట్ లేనప్పటికీ.. దేశవ్యాప్తంగా ఏ బ్యాంకులోనైనా ఒక వ్యక్తి ఒక్కసారికి రూ. 20,000 వరకు రూ. 2 వేల నోట్లు మార్చుకోవచ్చు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

ఇది కూడా చదవండి : FAQs About Rs 2000 Note: 2000 నోటు ఎప్పటివరకు చెల్లుతుంది ? ఎవరైనా ఇస్తే తీసుకోవచ్చా ?

ఇది కూడా చదవండి : Xiaomi 12 Pro Price: షావోమి 12 ప్రో ధరపై భారీ తగ్గింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Read More