Home> జాతీయం
Advertisement

India-China Border Clash: ఇండియా, చైనా సైనికుల మధ్య ఘర్షణ.. ప్రతిపక్షాలకు రాజ్‌నాథ్ సింగ్ సమాధానం

India-China Border Clash: ఇండియా, చైనా సరిహద్దుల్లో సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన పలువురు సైనికులకు స్వల్ప గాయాలయ్యాయని అన్నారు. మన దేశ సైనికులు క్షేమంగా ఉన్నారని సభకు తెలిపారు.

India-China Border Clash: ఇండియా, చైనా సైనికుల మధ్య ఘర్షణ.. ప్రతిపక్షాలకు రాజ్‌నాథ్ సింగ్ సమాధానం

India-China Border Clash: ఇండియా, చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు లెవనెత్తిన ప్రశ్నలు, సందేహాలకు లోక్‌సభలో రాజ్‌నాథ్ సింగ్ సమాధానం ఇచ్చారు. డిసెంబర్ 9న, తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సే ప్రాంతంలో చైనా ఆర్మీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలు భారత భూభాగంలోకి చొరబడి సరిహద్దుల్లో ప్రస్తుతం అనుసరిస్తున్న యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించాయని.. చైనా ఆర్మీ కుట్రలను భారత్ సైనికులు తిప్పికొట్టారని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. 

ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన పలువురు సైనికులకు స్వల్ప గాయాలయ్యాయని అన్నారు. మన దేశ సైనికులు క్షేమంగా ఉన్నారని సభకు తెలిపారు. భారత్ - చైనా సరిహద్దుల్లో శాంతి స్థాపన కోసం చైనాతో సంప్రదింపులు జరుపుతున్నామని.. ఇలాంటి కవ్వింపు చర్యలకు దూరంగా ఉండాల్సిందిగా చైనాకు హితవు పలికినట్టు మంత్రి రాజ్ నాథ్ సింగ్ సభకు వెల్లడించారు. 

చైనాతో ఘర్షణలో భారత్ సైనికులు చైనా సైనికులకు ధీటుగా సమాధానం ఇచ్చారని.. మన సైనికుల ఆత్మస్థ్యైరం దెబ్బతినకుండా వారి ధైర్య, సాహసాలకు ఈ సభ అండగా నిలుస్తుందని రాజ్ నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సభకు స్పష్టంచేశారు.

ఇది కూడా చదవండి : india vs china soldiers: భారత్, చైనా సైనికుల మధ్య మరోసారి ఘర్షణ.. పలువురు సైనికులకు గాయాలు

ఇది కూడా చదవండి : India-US Ties: సూపర్ పవర్‌గా భారత్.. మరో అగ్రరాజ్యంగా మారుతుంది: అమెరికా వైట్‌హౌస్ అధికారి జోస్యం 

ఇది కూడా చదవండి : Pakistan New Army Chief: పాకిస్థాన్ కొత్త ఆర్మీ చీఫ్‌గా అసిమ్‌ మునీర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More