Home> జాతీయం
Advertisement

rajinikanth :సీఎం కుర్చీపై రజినీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

రాజకీయాలంటే కేవలం ఓట్లుగానే భావిస్తున్నారని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వ్యాఖ్యానించారు.  ప్రజల పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో తాను రాజకీయ రంగంలో అడుగు పెట్టానన్నారు. రెండేళ్ల క్రితమే రాజకీయ ఆరంగేట్రం చేశానని చెప్పుకున్నారు. 

rajinikanth :సీఎం కుర్చీపై రజినీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

రాజకీయాలంటే కేవలం ఓట్లుగానే భావిస్తున్నారని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వ్యాఖ్యానించారు.  ప్రజల పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో తాను రాజకీయ రంగంలో అడుగు పెట్టానన్నారు. రెండేళ్ల క్రితమే రాజకీయ ఆరంగేట్రం చేశానని చెప్పుకున్నారు.  

ప్రజలను ఓటు బ్యాంకులా కాకుండా.. వారికి వారే స్వపరిపాలన అందించుకునేలా రాజకీయ స్థితిగతులు మారాల్సిన అవసరం ఉందని సూపర్ స్టార్ రజినీకాంత్ స్పష్టం చేశారు. రాజకీయ వ్యవస్థతోపాటు ప్రజల ఆలోచనా విధానంలోనూ మార్పు రావాలని తెలిపారు.  ముఖ్యంగా యువత ఎక్కువగా రాజకీయ రంగంలో అడుగు పెట్టాలని ఆకాంక్షించారు. 

Read Also: తెలివైన దొంగే..!! కానీ దొరికేశాడు..

చెన్నైలోని హోటల్ లీలా ప్యాలెస్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన రజినీకాంత్..  తన రాజకీయ రంగ ప్రవేశం గురించి 15 ఏళ్లుగా చర్చ జరుగుతోందన్నారు. ఐతే ఎప్పుడు రావాలో.. ఎలా రావాలో తనకు తెలుసన్నారు. త్వరలోనే పార్టీ పేరు ప్రకటిస్తానని స్పష్టం చేశారు తలైవా. అంతే కాదు తమిళనాడుకు ముఖ్యమంత్రి కావాలన్న ఆసక్తి తనకు లేదని స్పష్టం చేశారు. అన్ని అర్హతలు ఉన్న వ్యక్తినే ముఖ్యమంత్రి పీఠం కూర్చోబెడతానన్నారు. రాష్ట్రానికి అభివృద్ధి జరగాలంటే బాగా చదువుకున్న వ్యక్తి సీఎంగా ఉండాలని తెలిపారు.

Read Also: కరోనా దెబ్బకు 'బేర్'మన్న సెన్సెక్స్

 మరోవైపు ప్రభుత్వాలపై పార్టీ పెత్తనానికి సంబంధించి కూడా రజినీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పెట్టబోయే పార్టీలో ప్రభుత్వంపై పార్టీ పెత్తనం అస్సలు ఉండదని స్పష్టం చేశారు. పార్టీ ఏర్పాటు చేసే ముందే తనకు ముఖ్యంగా మూడు ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు రజినీకాంత్. వాటిని త్వరలోనే ప్రజలకు తెలియజేస్తానన్నారు.  తమిళనాడు నాటి ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత రాజకీయ అస్థిరత ఏర్పడిందని తెలిపారు. అధికార పీఠం కోసం ఏ ఏ పార్టీ ఎలాంటి చర్యలకు పాల్పడిందో తనకు తెలుసన్నారు. 

Read Also: రజినీకాంత్ పార్టీ పేరు ప్రకటించేది ఎప్పుడో తెలుసా..?

ఐతే పార్టీ పేరు ప్రకటిస్తారని ఆశగా ఎదురు చూసిన అభిమానులకు ఈ రోజు నిరాశే కలిగింది. ఆయన పార్టీ పేరు ప్రకటించకుండానే ప్రెస్ మీట్ ముగించారు. దీంతో పార్టీ పేరు ఎప్పుడు వస్తుందా..? అనే క్వశ్చన్ మార్క్ తోనే అభిమానులు వెనుదిరగాల్సి వచ్చింది..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Read More