Home> జాతీయం
Advertisement

Ban on photography: రేషన్, ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ ఫోటోలపై నిషేధం.. సీఎం ఆర్డర్స్

కరోనా వైరస్ కారణంగా నిరుపేదలు పడుతున్న ఆకలి బాధలు అన్నీ ఇన్నీ కావు. పేదలకు, రోజువారి కూలీలు, యాచకులకు ఆహార ప్యాకెట్లు, రేషన్‌ తదితర వస్తువులను ఉచితంగా అందజేసే క్రమంలో కొంతమంది వారితో ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న దృశ్యాలు కూడా అనేకం కనిపిస్తున్నాయి.

Ban on photography: రేషన్, ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ ఫోటోలపై నిషేధం.. సీఎం ఆర్డర్స్

జైపూర్‌‌: కరోనా వైరస్ కారణంగా నిరుపేదలు పడుతున్న ఆకలి బాధలు అన్నీ ఇన్నీ కావు. పేదలకు, రోజువారి కూలీలు, యాచకులకు ఆహార ప్యాకెట్లు, రేషన్‌ తదితర వస్తువులను ఉచితంగా అందజేసే క్రమంలో కొంతమంది వారితో ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న దృశ్యాలు కూడా అనేకం కనిపిస్తున్నాయి. అయితే, పేదలకు ఉచితంగా రేషన్, ఆహార పొట్లాలు పంపిణీ చేయడం మంచి పనే అయినప్పటికీ.. వారితో కలిసి ఫోటోలు తీసుకోవడం మాత్రం సరైన చర్య కాదని రాజస్తాన్ సర్కార్ అభిప్రాయపడింది. అంతేకాకుండా ఆహారం, రేషన్ పంపిణీ సమయంలో ఫోటోలు తీయడంపై నిషేధం విధిస్తూ రాజస్థాన్‌ సీఎం అశోక్‌గెహ్లాట్‌ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. 

Also read : Lockdown: అలా అయితే, పేదల ఖాతాల్లో రూ.5 వేలు జమ చేయండి: అసదుద్దీన్ ఒవైసి

పేదలకు సేవాభావంతో సహాయం చేయాలి కానీ వారితో ఫోటోలు తీసుకుని ప్రచారాస్త్రాంగా ఉపయోగించుకోకూడదని తొలుత అజ్మీర్‌ జిల్లా‌ కలెక్టర్‌‌ ప్రకటించారు. అజ్మీర్ జిల్లా కలెక్టర్ ప్రకటనతో ఏకీభవిస్తూ సీఎం అశోక్ గెహ్లాట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పేదలకు సాయం చేసి ఫోటోలు, సెల్ఫీలు తీసుకునే క్రమంలో సోషల్‌ డిస్టన్సింగ్ నియమాన్ని ఉల్లంఘిస్తున్నారని, అందుకే సెల్ఫీలు నిషేధిస్తున్నామని అజ్మీర్‌‌ కలెక్టర్‌‌ అభిప్రాయపడ్డారు. ఎవరైనా సోషల్‌ డిస్టన్సింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తే.. వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పౌరులు సోషల్ డిస్టన్సింగ్ పాటిస్తూనే తమ సేవాభావాన్ని చాటుకోవాలని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ స్పష్టంచేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More