Home> జాతీయం
Advertisement

Ashok Gehlot tested Covid Positive: రాజస్థాన్ సీఎం అశోక్​ గహ్లోత్​కు కరోనా పాజిటివ్​

Ashok Gehlot tested Corona Positive: రాజస్థాన్​ సీఎం అశోక్​ గహ్లోత్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఆయన కుమారుడికి కొవిడ్ పాజిటివ్​గా తేలిన మరునాడే..  తనకు కొవిడ్​ పాజిటివ్​గా తేలడం గమనార్హం.

Ashok Gehlot tested Covid Positive: రాజస్థాన్ సీఎం అశోక్​ గహ్లోత్​కు కరోనా పాజిటివ్​

Ashok Gehlot tested Corona Positive: రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్ మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ట్విట్టర్ ద్వారా (Ashok Gehlot twitter) వెల్లడించారు. తనకు అతి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు వివరించారు.

ఈ రోజు తనను కలిసిన ప్రతి ఒక్కరు ఐసోలేషన్​లో ఉండాలని, కొవిడ్ టెస్టు కూడా చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు గహ్లోత్​.

గత ఏడాది ఏప్రిల్​ 29న ఆశోక్​  గహ్లోత్​ తొలిసారి కొవిడ్ బారిన పడ్డారు. ఆ సమయంలో కూడా గహ్లోత్​కు​ స్వల్ప లక్షణాలతోనే కొవిడ్ పాజిటివ్​గా తేలింది.

సీఎం కుమారుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైభవ్​ గహ్లోత్​కు కూడా నిన్న (బుధవారం) కొవిడ్ పాజిటివ్​గా తేలింది. ఆయనకు లక్షణాలు లేకుండానే కొవిడ్ పాజిటివ్​గా తేలడం గమనార్హం. దీనితే వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్​లో చికిత్స తీసుకుంటున్నారు వైభవ్​ గహ్లోత్​

ప్రజలకు సీఎం హెచ్చరిక..

ప్రజలంతా కొవిడ్​ను సీరియస్​గా తీసుకోవాలని సీఎం (Ashok Gehlot on Corona news) అశోక్ గహ్లోత్ సూచించారు. చాలా మంది ఒమిక్రాన్ వేరియంట్ ప్రాణాంతకం కాదనే అభిప్రాయంతో నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని.. అయితే ఒమిక్రాన్ నుంచి కోలుకున్న తర్వాత తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నట్లు వైద్యులు (Ashok Gehlot on Corona impact) నిర్ధారించినట్లు గుర్తు చేశారు.అందుకే ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అర్హులంతా రెండు డోసుల వ్యాక్సిన్ (Ashok Gehlot on Corona vaccine)​ తీసుకోవాలన్నారు.

కొవిడ్ అనంతర సమస్యలలో ఉబ్బసం, తలనొప్పి, ఊపిరితిత్తుల వ్యాధులు, మూత్రపిండాల సమస్యలు గుండె జబ్బులు కూడా ఉండొచ్చని వైద్యులు చెబుతున్నట్లు సీఎం అశోక్ గహ్లోత్​ పేర్కొన్నారు.

Also read: Omicron scare: కేరళలో ఒమిక్రాన్​ విజృంభణ- కొత్తగా 50 మందికి పాజిటివ్​

Alsor read: Air India flight: విమానంలో కరోనా కలకలం.. 125 మందికి కొవిడ్ పాజిటివ్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More