Home> జాతీయం
Advertisement

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాయు'గండం'..రాగల మూడురోజులపాటు వానలే వానలు..!

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ముసురు పట్టుకుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడింది. లెటెస్ట్ వెదర్‌ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం..

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాయు'గండం'..రాగల మూడురోజులపాటు వానలే వానలు..!

Rain Alert: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై తీవ్ర అల్పపీడన ప్రభావం అధికంగా కనిపిస్తోంది. నిన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్‌, దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో ఉన్న అలప్పీడనం ఇవాళ తీవ్ర అల్పపీడనంగా మారింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. అల్పపీడనానికి అనుబంధంగా ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టం నుంచి మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించింది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం..వాయుగుండంగా బలపడనుంది.

ఆ తర్వాత దక్షిణ ఒడిశా-ఉత్తర ఏపీ తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరానికి చేరే అవకాశం ఉంది. ఇవాళ అల్పపీడనం ద్రోణి ఓఖ, అకోలా, జగ్దల్‌పూర్ గుండా, తూర్పు ఆగ్నేయ దిశగా వెళ్లనుంది. మరోవైపు దక్షిణ కొంకణ్‌ నుంచి ఉన్న ద్రోణి..ఇవాళ కొంకణ్‌ తీరం నుంచి మహారాష్ట్ర, తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ మీదుగా కేంద్రీకృతమైంది. వాయవ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. 

వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడురోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇవాళ, రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఎల్లుండి మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాలతోపాటు ఈదురుగాలులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై అధికంగా ఉంది. కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

తీరం వెంట పెను గాలులు వీస్తున్నాయి. రాగల మూడురోజులపాటు వాతావరణం ఇలాగే ఉంటుందని అమరావతి, విశాఖ వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. ఇవాళ, రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. వానలతోపాటు ఈదురుగాలు వీస్తాయని హెచ్చరించింది. రాయలసీమ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర అల్పపీడనం..వాయుగుండగా మారిన తర్వాత మరిన్ని వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Also read:Virat Kohli: ఎప్పటికీ కోహ్లీ గర్జించే సింహమే..చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తికర ట్వీట్..!

Also read:Munugode: తెలంగాణ కాంగ్రెస్‌లో మునుగోడు చిచ్చు..రేవంత్‌రెడ్డికి అధిష్టానం షాక్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More