Home> జాతీయం
Advertisement

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. తాజా వెదర్ రిపోర్ట్‌ను ఇప్పుడు చూద్దాం..

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల రాగల మూడురోజులపాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. నిన్న ఆంధ్రప్రదేశ్‌ తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా కేంద్రీకృతం అయిన ఉపరితల ఆవర్తనం ఇవాళ అదే ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. నిన్న ఉత్తర అండమాన్ సముద్ర నుంచి ఏపీ తీరం వరకు మధ్య బంగాళాఖాతం మీదుగా తూర్పు పడమర ద్రోణి కొనసాగుతోంది.

తాజాగా తూర్పు పడమర ద్రోణి..తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి రాయలసీమ వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీట్లర ఎత్తులో ఉంది. అక్టోబర్ 1 నాటికి ఈశాన్య, పరిసర తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో ఇవాళ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. రేపు చాలా చోట్ల, ఎల్లుండి కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.

మరికొన్ని ప్రాంతాల్లో ఇవాళ ఉరుములు, మెరుపులతోపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, రేపు ఉరుములు, మెరుపులతోపాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు ఏపీలోనూ ఇదే వాతావరణ కనిపిస్తోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావం రాష్ట్రంపై అధికంగా కనిపిస్తోంది. ఏపీ తీరంలోని పశ్చిమ మధ్య బంగాఖాతంలో ఉపరితల కేంద్రీకృతమైంది.

దీనితోపాటు తూర్పు పడమర ద్రోణి..తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి రాయలసీమ వరకు కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఏపీవ్యాప్తంగా జోరు వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలో ఇవాళ, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే పలు చోట్ల వానలు పడుతున్నాయి. తీరం ప్రాంతాల్లో వాతావరణం మరోలా ఉంటుందని అమరావతి, విశాఖ వాతావరణ శాఖలు తెలిపాయి. ఈసమయంలో పెనుగాలు వీచే అవకాశం ఉంది.

గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మరో మూడురోజులపాటు చేపల వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఇటు రాయలసీమలో గతంలో ఎన్నడూలేనివిధంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి సాయంత్రం నుంచి వర్షం పడుతూనే ఉంది. దీంతో వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగిపోర్లి ప్రవహిస్తున్నాయి.

Also read:TS Govt: తెలంగాణలో వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్..ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Also read:PM Kisan Latest Update: పీఎం కిసాన్ పథకంలో కీలక మార్పులు..రైతుల కోసం పలు సూచనలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More