Home> జాతీయం
Advertisement

Rahul Gandhi: సోనియా ఆస్పత్రిలో ఉంటే లేఖలా.. రాహుల్ గాంధీ ఫైర్! 

కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సంక్షోభంపై చర్చించేందుకు నిర్వహిస్తోన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) కీలక సమావేశం వాడీవేడీగా కొనసాగుతోంది. పార్టీ సీనియర్ నేతలపై రాహుల్ గాంధీ ఆగ్రహం (Rahul Gandhi Comments At CWC) వ్యక్తం చేశారు.

Rahul Gandhi: సోనియా ఆస్పత్రిలో ఉంటే లేఖలా.. రాహుల్ గాంధీ ఫైర్! 

కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సంక్షోభంపై చర్చించేందుకు నిర్వహిస్తోన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) కీలక సమావేశం వాడీవేడీగా కొనసాగుతోంది. పార్టీ సీనియర్ నేతలపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లి, కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సమయంలో లేఖలు రాయడం ఏంటని ప్రశ్నించారు. ఆన్‌లైన్‌లో నిర్వహిస్తోన్న ఈ సీడబ్ల్యూసీ సమావేశానికి దాదాపు 50 మంది వరకు పార్టీ నేతలు హాజరైనట్లు తెలుస్తోంది. Diabetes Prevention: షుగర్ పేషెంట్స్ అలా నడిస్తేనే ప్రయోజనం

బీజేపీతో కుమ్మక్కయి ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా అంటూ పార్టీ సీనియర్ నేతలపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతకుముందు పార్టీ నాయకత్వంపై 23 మంది సీనియర్ నేతలు రాసిన లేఖలను పార్టీ నేత వేణుగోపాల్ చదివి వినిపించారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడారు. సోనియా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సమయంలో లేఖలు రాయడం సరికాదని సీనియర్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లేఖలు రాసేందుకు అదే సమయం దొరికిందా అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. Fact Check: ఎస్పీ బాలుకి కరోనా నెగటివ్.. అసలు విషయం ఇది

తాను కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగినప్పుడు సైతం సోనియా గాంధీ ఆ పదవి స్వీకరించేందుకు నిరాసక్తి చూపించారని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గుర్తుచేశారు. కేవలం సీడబ్ల్యూసీ సభ్యులు, కీలక నేతల మద్దతుతోనే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారని, అలాంటి వ్యక్తి హాస్పటల్‌తో చేరిన సమయంలో ఇలాంటి పనులు చేయడం తగదని రాహుల్ వ్యాఖ్యానించారు. Shalini Vadnikatti Wedding Photos: దర్శకుడిని పెళ్లాడిన యంగ్ హీరోయిన్ 
Badam Benefits: ఉదయాన్నే బాదం తింటున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా! 
 Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి

 

Read More