Home> జాతీయం
Advertisement

Narendra Modi: ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్..

Narendra Modi: 2024లో 18వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.  మరో మూడు రోజుల్లో అందుకు ముహూర్తం ఫిక్స్ అయింది.

Narendra Modi: ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్..

Narendra Modi: దేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. గతంలో వచ్చిన 303 సీట్లకు 63 సీట్లు తగ్గి కేవలం 240 సీట్లకే పరిమితమైంది. అంటే మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లకు 32 సీట్లు తక్కువ పడ్డాయి. కానీ ఎన్డీయే కూటమిగా 292 సీట్లకే పరిమితమైంది. ఈ కూటమిలో బీజేపీ తర్వాత తెలుగు దేశం పార్టీ 16 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత జనతా దళ్ యునైటెడ్ పార్టీకి 12 సీట్లు వచ్చాయి. అటు శివసేన ఏక్ నాథ్ షిండేకు 7 సీట్లు.. లోక్ జనశక్తి పార్టికి 5 సీట్లు.. జనసేన, జనతాదళ్ సెక్యులర్ పార్టీకి చెరో 2 సీట్లు.. రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీకి 2 సీట్లు.. వచ్చాయి. మొత్తంగా ఎన్టీయే కూటమిలో ఇపుడు తెలుగు దేశం పార్టీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది.

ఈ సారి  ప్రజలు బీజేపికి అత్తెసరు సీట్లు ఇవ్వడంతో ఎన్టీయేలోని మిత్ర పక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. రెండు సార్లు అధికారంలో ఉండి ఈ మాత్రం సీట్లు రావడం కూడా ఆశ్యర్యకర విషయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పదేళ్ల వ్యతిరేకతను తట్టుకొని నిలబడటం మాములు విషయం కాదంటున్నారు.  అంతేకాదు ఈ సారి మిత్రపక్షాల  గొంతెమ్మ కోరికలు కూడా బీజేపీకి ఈ సారి సవాల్ గా నిలువనున్నాయి. గత రెండు పర్యాయాలు ఎన్టీయే కూటమిగా అధికారంలో వచ్చినా.. బీజేపీ పార్టీకే సొంతంగా మెజారిటీ మార్క్ సొంతం చేసుకుంది. దీంతో కొన్ని చట్టాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకురాగలిగింది.

కానీ ఈ సారి మాత్రం బీజేపీ 240 సీట్లకు పరిమితం కావడం.. మెజారిటీ మార్క్ కు 32 సీట్లు తక్కువ కావడంతో వీలైనంత తొందరగా నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అందుకు తగ్గట్టే ఈ నెల 8న ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ దేశ రాజధాని ధిల్లీలోని కర్తవ్య పథ్ లో  ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు రాష్ట్రపతి కూడా దేశంలో ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీనే ముందుగా పిలవడం ఆనవాయితీ వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీని ఆహ్వానించినట్టు సమాచారం. ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బీజేపీ పాలిత ముఖ్యమంత్రులతో పాటు ఎన్డీయే కూటమి నేతలు హాజరు కానున్నారు.  ఈ సందర్బంగా  మిగతా పక్షాలను కూడా ఎన్టీయేలో తీసుకొచ్చేందుకు ఇప్పటికే ముమ్ముర ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. మరి ఈ సారి నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఎన్డీయే భాగస్వామయ్య పక్షాలకు ఏయే పోర్ట్ పోలియోలు ఇవ్వనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

Also read: AP Assembly Results 2024: ఏపీ ఎన్నికల్లో జనసేన క్లీన్‌స్వీప్, పవన్ సహా ఎవరి మెజార్టీ ఎంత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More