Home> జాతీయం
Advertisement

PK rejects congress offer : కాంగ్రెస్‌కు ప్రశాంత్ కిశోర్ మొండిచేయి.. ఆఫర్ తిరస్కరణ

PK rejects congress offer : కాంగ్రెస్‌కు ప్రశాంత్ కిశోర్ మొండిచేయి.. ఆఫర్ తిరస్కరణ

PK rejects congress offer : కాంగ్రెస్‌కు ప్రశాంత్ కిశోర్ మొండిచేయి.. ఆఫర్ తిరస్కరణ

PK rejects congress offer : కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నిరాకరించారు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈఏజీలో చేరమని సాదరంగా ఆహ్వానించారు కానీ... అందుకు అంగీకరించలేదన్నారు ప్రశాంత్ కిషోర్.

కాంగ్రెస్ పార్టీకి తనకంటే కూడా పటిష్ట నాయకత్వం, పార్టీలో ఏళ్లతరబడి సంస్థాగతంగా వేళ్లూనుకుపోయిన నిర్మాణాత్మక సమస్యలను పరివర్తనతో కూడిన సంస్కరణల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. అందుకు పార్టీ నేతలందరికీ దృఢమైన చింతన అవసరమని ప్రశాంత్ కిశోర్ అన్నారు.

ప్రశాంత్ కిశోర్ పార్టీ చేరిక అంశంపై కాంగ్రెస్ అధికారికంగా స్పందించింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ట్విటర్‌లో స్పందిస్తూ.. ప్రశాంత్ కిశోర్‌ను కాంగ్రెస్ పార్టీ ఈఏజీ 2024లో చేరాలని ఆహ్వానించిందని, ఆయన తిరస్కరించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ కోసం ప్రశాంత్ కిశోర్ చేసిన కృషి, పార్టీకి పీకే అందించిన సలహాలు, సూచనలు అభినందనీయమన్నారు సుర్జేవాలా.

Following a presentation & discussions with Sh. Prashant Kishor, Congress President has constituted a Empowered Action Group 2024 & invited him to join the party as part of the group with defined responsibility. He declined. We appreciate his efforts & suggestion given to party.

ప్రశాంత్ కిశోర్ తాజా నిర్ణయంతో తెలంగాణ కాంగ్రస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రశాంత్ కిశోర్ టీఆర్‌ఎస్‌ సలహాదారుగా పనిచేస్తున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వరుసగా భేటీ అయ్యారు. మరోవైపు సోనియాతో ఈ నెలలో వరుస భేటీలు నిర్వహించారు పీకే. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్-టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయనే సంకేతాలు వెళ్లాయి. తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలు సైతం ఇదే అంశాన్ని ఉటంకిస్తూ ముమ్మర ప్రచారం సాగించారు. గత కొంత కాలంగా నేడో రేపో పీకే కాంగ్రెస్ చేరిక లాంఛనమే అంటూ వార్తలు కూడా వచ్చాయి. కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్‌ పీకేకు నచ్చలేదో, మరే కారణంగా వద్దన్నాడో కానీ.. చేరిక లేదని ప్రకటించటంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా పీకేపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగానే విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వల్ల కాకనే పీకేను నియమించుకున్నారని, పీకేలు వచ్చినా ఏం ఈకలేరని బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. తాజాగా వెలువడిన ప్రకటన రేవంత్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఊరటనిచ్చింది.

Also Read: adipurush: ఆదిపురుష్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More