Home> జాతీయం
Advertisement

Bundelkhand Expressway:ప్రధాని మోడీ ప్రారంభించిన ఐదు రోజులకే బుందేల్‌ఖండ్ ఎక్స్ ప్రెస్ వేపై గుంత!

Bundelkhand Expressway: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అత్యంత వెనుక‌బ‌డిన ప్రాంతంగా చెప్పుకునే బుందేల్‌ఖండ్ లో కేంద్ర ప్రభుత్వం ఎక్స్ ప్రెస్ వేను నిర్మించింది.  ఈ రోడ్డుతో బుందేల్ ఖండ్ దశ మారుతుందని గొప్పగా చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఐదు రోజుల క్రితమే ప్రారంభించి జాతికి అంకితం చేశారు

Bundelkhand Expressway:ప్రధాని మోడీ ప్రారంభించిన ఐదు రోజులకే బుందేల్‌ఖండ్ ఎక్స్ ప్రెస్ వేపై గుంత!

Bundelkhand Expressway: మనదేశంలో ఏ పని చేసిన నాసిరకమే అన్న విమర్శలు ఉన్నాయి. ఇక రోడ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ వైపు నిర్మిస్తుండగానే... మరోవైపు కూలిపోయిన ఘటనలు ఉన్నాయి. కాంట్రాక్టర్ల కాసుల కక్కుర్తితో నాసినరకం రోడ్లు నిర్మిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏవో చిన్నచిన్న రోడ్లకు కాదు.. జాతీయ రహదారుల నిర్మాణంలోనూ నాణ్యతలేమి బయపడుతుంటుంది. తాజాగా మరో రోడ్డు ప్రారంభించిన  ఐదు రోజులకే కోతకు గురైంది. అయితే సాదాసీదా రోడ్డు కాదు. కేంద్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎక్స్ ప్రెస్ వే. అది కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ఐదు రోజులకే ఆ ఎక్స్ ప్రెస్ వే కోతకు గురికావడం సంచలనంగా మారింది. ఉత్తర్ ప్రదేశ్ లో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా రాజకీయ రచ్చగా మారింది. విపక్షాలకు అస్త్రంగా మారింది. దీంతో ప్రధాని ప్రారంభించిన రోడ్డు దుస్థితి ఇదీ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు భారీగా వస్తున్నాయి. 

వివరాల్లోకి వెళితే..  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అత్యంత వెనుక‌బ‌డిన ప్రాంతంగా చెప్పుకునే బుందేల్‌ఖండ్ లో కేంద్ర ప్రభుత్వం ఎక్స్ ప్రెస్ వేను నిర్మించింది.  ఈ రోడ్డుతో బుందేల్ ఖండ్ దశ మారుతుందని గొప్పగా చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఐదు రోజుల క్రితమే ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే కొంత కోతకు గురైంది. ఆ రోడ్డుపై  వ‌ర‌ద నీరు పొంగి ప్రవహించింది.  జాతీయ ర‌హ‌దారిపై ఓ చోట మొత్తం రోడ్డు కొట్టుకుపోయింది. పెద్ద గుంత ఏర్పడింది.  

బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే కొట్టుకుపోయిన వీడియోను  సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ర‌న్‌విజ‌య్ సింగ్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన హైవే 5 రోజుల‌కే ఇలా కొట్టుకుపోయిందంటూ ఆయ‌న ఓ కామెంట్‌ను దానికి జ‌త చేశారు. బుందేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం పూర్తి కాకుండానే  ప్రచారం కోసం మోడీ ప్రారంభించారని, తాజా వర్షాలు ఆ విషయాన్ని బట్టబయలు చేశాయని సమాజ్ వాదీ పార్టీ మరో వీడియోను పోస్ట్ చేసింది. 

Also read:Presidential Election Result-LIVE Updates: కొనసాగుతున్న భారత రాష్ట్రతి ఎన్నికల కౌంటింగ్..ఆధిక్యంలో ద్రౌపది ముర్ము..!

Also read:Somu Veerraju: పోలవరాన్ని వివాదస్పదం చేసేందుకు కుట్ర జరుగుతోందా..? సోమువీర్రాజు ఏమన్నారంటే..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More