Home> జాతీయం
Advertisement

Post office Schemes: పోస్టాఫీసు సేవింగ్ పధకాల్లో దేనిపై ఎంత వడ్డీ ఉందో తెలుసా

Post office Schemes: దేశంలో గత కొద్దికాలంగా పోస్టాఫీసు పథకాలకు ఆదరణ పెరుగుతోంది. ఆకర్షణీయమైన వడ్డీ, అందుబాటులో పథకాలు ఉండటంతో పోస్టాఫీసుల సేవింగ్ స్కీమ్స్‌పై ఆసక్తి పెరుగుతోంది. మీక్కూడా పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసే ఆలోచన ఉంటే ఏ పథకాలపై ఎంత వడ్డీ లభిస్తోందనే వివరాలు తెలుసుకుందాం.

Post office Schemes: పోస్టాఫీసు సేవింగ్ పధకాల్లో దేనిపై ఎంత వడ్డీ ఉందో తెలుసా

Post office Schemes: మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్ఠిఫికేట్ సహా చాలా పధకాలు పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్నాయి. వీటిపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి సమీక్షిస్తుంటుంది. ఈ ఏడాది ఏప్రిల్- జూన్ వరకు ఉన్న వడ్డీ రేట్లనే రానున్న త్రైమాసికానికి వర్తించనున్నాయి. 

మార్కెట్‌లో అధిక రిటర్న్స్ సాధించేందుకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. అందులో షేర్ మార్కెట్ లేదా మ్యూచ్యువల్ ఫండ్స్ ఒకటి. కానీ వీటిలో రిస్క్ ఎక్కువ ఉంటుంది. లేదా ఎంతో కొంత ఉండవచ్చు. కానీ పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్ మాత్రం మినిమం గ్యారంటీ రిటర్న్స్ ఇస్తాయి. జీరో రిస్క్ ఉంటుంది. పోస్టాఫీసుల్లో అలాంటి 10 సేవింగ్స్ స్కీమ్స్ ఉన్నాయి. అందులో నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అంటే పోస్టాఫీసు ఆర్‌డి, పోస్టాఫీసు ఎఫ్‌డి, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, నేషనల్ ఇన్‌కం మంత్లీ ఇన్‌కం ఎక్కౌంట్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటివి ముఖ్యమైనవి. వీటిలో ఏ స్కీమ్‌లో ఎంత వడ్డీ ఉంటుందో చెక్ చేద్దాం

సేవింగ్స్ ఎక్కౌంట్ అనేది పోస్టాఫీసులో 500 రూపాయలకు ఓపెన్ చేయవచ్చు. దీనిపై వార్షిక వడ్డీ 4 శాతం చెల్లిస్తారు. ఇక రెండవది పోస్టాఫీసు టైమ్ డిపాజిట్. ఇది 1-5 ఏళ్ల కాల పరిమితికి ఉంటుంది. ఇందులో కనీసం 1000 రూపాయలు గరిష్టంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. దీనిపై వడ్డీ 6.9 శాతం నుంచి 7.5 శాతం ఉంది.

మరో పధకం రికరింగ్ డిపాజిట్. ఇది ఐదేళ్లకు ఉంటుంది. ఇందులో కూడా కనీసం 1000 రూపాయలు గరిష్టంగా పరిమితి లేదు. 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక ఇంకో పధకం పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, పీపీఎఫ్. 500 రూపాయల నుంచి ప్రారంభించవచ్చు. వడ్డీ 7.1 శాతం ఉంటుంది. మరో పధకం పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీమ్. ఇది కూడా ఐదేళ్ల కాల పరిమితికి వర్తిస్తుంది. 1000 రూపాయల నుంచి ప్రాంరభమౌతుంది. 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. 

సుకన్యా సమృద్ధి స్కీమ్. ఇది అమ్మాయిలకు ఉద్దేశించినది. 250 రూపాయలతో ప్రారంభించవచ్చు. ఏడాదికి 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. ఇది కూడా 5 ఏళ్లకు వర్తిస్తుంది. ఇందులో 1000 రూపాయల నుంచి గరిష్టంగా 15 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. వడ్డీ 8.2 శాతం ఉంటుంది. 

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. ఇది 5 ఏళ్ల కాలపరిమితికి ఉంటుంది. ఇందులో కనీసం 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయవచ్చు. గరిష్టంగా పరిమితి లేదు. ఏడాదికి వడ్డీ 7.7 శాతం చెల్లిస్తారు. ఇక మరో ముఖ్యమైన పధకం కిసాన్ వికాస్ పత్ర. 1000 రూపాయలు కనీస పెట్టుబడి. వార్షిక వడ్డీ 7.5 శాతం ఉంది. ఇక మహిళలకు ఉద్దేశించిన పధకం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్. కనీసం 1000 రూపాయలు పెట్టుబడి ఉంటుంది. వడ్డీ 7.5 శాతం చెల్లిస్తారు.

Also read: Weight Loss Drinks: రోజూ రాత్రి వేళ ఈ డ్రింక్స్ తాగితే 4 వారాల్లో అధిక బరువుకు చెక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More