Home> జాతీయం
Advertisement

ప్రధాని మోదీ అనిల్ అంబానీకి రూ.30,000 కోట్లు ఎందుకిచ్చారు..?

భారత ప్రధాని నరేంద్ర మోదీ పై రాహుల్ గాంధీ మళ్లీ ధ్వజమెత్తారు. ఆయనంత అవినీతి పరుడైన ప్రధానిని తాను జీవితంలో చూడలేదని రాహుల్ మండిపడ్డారు. 

ప్రధాని మోదీ అనిల్ అంబానీకి రూ.30,000 కోట్లు ఎందుకిచ్చారు..?

భారత ప్రధాని నరేంద్ర మోదీ పై రాహుల్ గాంధీ మళ్లీ ధ్వజమెత్తారు. ఆయనంత అవినీతి పరుడైన ప్రధానిని తాను జీవితంలో చూడలేదని రాహుల్ మండిపడ్డారు. ఎవరిని అడిగి రూ.30,000 కోట్ల రూపాయలను అనిల్ అంబానీకి మోదీ కట్టబెట్టారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయానికి సంబంధించి ప్రధానిపై ఎన్ని కేసులు నమోదు చేసినా తప్పు లేదని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఫ్రాన్స్ వార్తా వెబ్ సైట్ మీడియా పార్ట్ ఇటీవలే డసాల్ట్ ఏవియేషన్ విడుదల చేసిన ఓ డాక్యుమెంటును చూపిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ డాక్యుమెంట్ చదివితే.. అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ డిఫెన్స్ సంస్థ కాంట్రాక్ట్ ఎలా పొందిందన్న విషయంపై అన్ని వాస్తవాలు బహిర్గతమవుతాయని ఆయన తెలిపారు.

"గతంలో సాక్షాత్తు ఫ్రాన్స్ అధ్యక్షుడే మోదీ గురించి మాట్లాడుతూ.. భారత ప్రధాని చెప్పిన విధంగానే తాము రిలయెన్స్‌తో భాగస్వామ్యానికి ఒప్పుకున్నామని అన్నారు. నిన్నే మన రక్షణ మంత్రి హుటాహుటిన వెళ్లి రాఫెల్ ప్లాంట్ సందర్శించడానికి మొగ్గు చూపుతున్నారు. అంత ఎమర్జన్సీ ఏముంది. ఇవి అన్ని కూడా అనుమానానికి తావిచ్చే విషయాలే" అని రాహుల్ తెలిపారు. 

బుధవారం భారత రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్‌‌కు మూడు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లారు. ఆ పర్యటనలో భాగంగానే ఆమె డాసాల్ట్ ఏవియేషన్ ప్రొడక్షన్ ప్లాంట్ కూడా సందర్శించనున్నారు. ఇదే ప్లాంట్ రాఫెల్ ఫైటర్ జెట్ విమానాలను తయారుచేస్తోంది. ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ రాహుల్, బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ రాఫెల్ డీల్ విషయంలో జరుగుతున్న అవకతవకలకు బాధ్యత వహించాల్సి ఉందని.. డాక్యుమెంట్లు వాస్తవాలు బహిర్గతం చేస్తున్నాక కూడా.. ప్రధానిని తప్పు పట్టకుండా తాము ఎలా ఊరుకుంటామని రాహుల్ అభిప్రాయపడ్డారు.

Read More