Home> జాతీయం
Advertisement

ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర.. మోదీకి గట్టి భద్రత !!

ప్రధాని మోదీ భద్రతపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ సమీక్ష

ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర.. మోదీకి గట్టి భద్రత !!

ప్రధాని నరేంద్రమోదీపై హత్యకు కుట్ర జరుగుతోందని మహారాష్ట్ర పోలీసులు చేసిన హెచ్చరికలతో అప్రమత్తమైన కేంద్ర హోం శాఖ.. మోదీకి మరింత పటిష్టమైన భద్రత కల్పించే ఏర్పాట్లలో తలమునకలైంది. అందులో భాగంగానే నేడు హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ హోం శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై మోదీ భద్రతకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై చర్చించారు. ఇప్పటివరకు ప్రధాని భద్రతరీత్యా హోంశాఖ తీసుకుంటున్న చర్యలు, పాటిస్తున్న జాగ్రత్తలు, ఇకపై పెంచాల్సిన భద్రతా ప్రమాణాలు వంటి అంశాలపై సంబంధిత అధికారులతో మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సుదీర్ఘంగా చర్చించారు. భీమా-కోరేగావ్‌ అల్లర్ల కేసులో ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని విచారించే సందర్భంలో ఒకరి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న లేఖల్లో మోదీ హత్యకు కుట్ర జరుగుతోందన్న విషయం బట్టబయలైంది. నిందితులలో ఒకరైన ఓ ఢిల్లీ వాసికి సీపీఐ(ఎం)తో సంబంధాలు కలిగి ఉన్నాయని, సీపీఐ(ఎం)కి అతడికి మధ్య చేతులు మారిన లేఖల్లో మోదీ హత్యకు కుట్రపన్నినట్టుగా ప్రస్తావించిన ఆధారాలు ఉన్నాయంటూ పూణె పోలీసులు జూన్ 7వ తేదీనే పలు ఆధారాలను కోర్టుకు సమర్పించిన సంగతి తెలిసిందే.

 

ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలు నిర్వహించే సమయంలో అదను చూసుకుని అతడిని మట్టుపెట్టాల్సిందిగా ఆ లేఖల్లో పేర్కొన్నట్టుగా పూణె పోలీసులు కేంద్రానికి తెలిపారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తరహాలోనే మోదీ హత్యకు కుట్ర జరుగుతోందని మహారాష్ట్ర పోలీసులు అందించిన సమాచారం నేపథ్యంలోనే కేంద్ర హోం శాఖ ప్రధాని భద్రతపై నేడు సమీక్ష నిర్వహించింది.

Read More