Home> జాతీయం
Advertisement

PM Modi: నగదు బదిలీ ద్వారా 170 వేల కోట్లు ఆదా చేయగలిగాం

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నగదు బదిలీ ప్రక్రియ ద్వారా  భారీగా ప్రయోజనం చేకూరిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఏకంగా లక్షా 70 వేల కోట్లను అక్రమార్కుల చేతికి వెళ్లకుండా అడ్డుకట్ట వేశామన్నారు.

PM Modi: నగదు బదిలీ ద్వారా 170 వేల కోట్లు ఆదా చేయగలిగాం

కేంద్ర ప్రభుత్వం ( Central Government ) ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నగదు బదిలీ ప్రక్రియ  ( Cash transfer scheme ) ద్వారా  భారీగా ప్రయోజనం చేకూరిందని ప్రధాని మోదీ ( pm modi ) స్పష్టం చేశారు. ఏకంగా లక్షా 70 వేల కోట్లను అక్రమార్కుల చేతికి వెళ్లకుండా అడ్డుకట్ట వేశామన్నారు.

విజిలెన్స్‌, అవినీతి నిరోధక చర్యలపై సతర్క్‌ భారత్‌..సమృద్ధ్ భారత్‌ పేరుతో ఏర్పాటైన జాతీయ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ( Pm narendra modi ) మాట్లాడారు. అవినీతి నియంత్రణలో గత ప్రభుత్వాల తీరును ఈ సందర్భంగా మోదీ  తప్పుబట్టారు. ముఖ్యంగా లబ్ధిదారుల ఖాతాలకు నగదు బదిలీ చేయడం ద్వారా అవినీతి ( Corruption ) , కుంభకోణాలను ( Scams ) నిరోధించగలిగామని మోదీ చెప్పారు. నగదు బదిలీ ద్వారా ఇప్పుడు పేదలు నూటికి నూరుశాతం ప్రయోజనం పొందుతున్నారన్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఏకంగా 1 లక్షా 70 వేల కోట్లు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా ఆదా చేయగలిగామని చెప్పారు. 

గడిచిన 4-5 దశాబ్దాల్లో అవినీతికి పాల్పడినవారు శిక్షకు నోచుకోకపోవడంతో..అవినీతి మరింత ఎక్కువైందన్నారు. అవినీతి అనేది పలు రాష్ట్రాల రాజకీయ సంప్రదాయంలో భాగమైందన్నారు. అవినీతిపై అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు మోదీ.

మరో కార్యక్రమంలో భాగంగా..ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ( Central Finance ministe Nirmala sitaraman ) కీలక విషయం ప్రకటించారు. కరోనా వైరస్ కారణంగా కుదైలన దేశ ఆర్ధిక వ్యవస్థ ( Indian finance sector ) ఇప్పుడు కోలుకుంటోందని చెప్పారు. అయినా సరే జీడీపీ వృద్ధి ( GDP Growth ) మాత్రం నెగెటివ్ లేదా జీరోకు చేరవచ్చని చెప్పారు. ఇది చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తొలి త్రైమాసికం అంటే ఏప్రిల్‌ - జూన్‌ మధ్యకాలంలో ఆర్థిక వ్యవస్థ 23.9 శాతం మేర దెబ్బతినడమే దీనికి కారణమని ఆర్ధిక శాఖ మంత్రి తెలిపారు.  ఇండియా ఎనర్జీ ఫోరంలో మాట్లాడిన కేంద్రమంత్రి ..కోవిడ్‌-19 ( Covid19 ) వ్యాప్తిని కట్టడి చేయడం ద్వారా ప్రజల జీవనోపాధి కంటే వారి ప్రాణాలను కాపాడిందని చెప్పుకొచ్చారు. అందుకే మార్చి 25 నుంచి కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేసిందని గుర్తుచేశారు.

తాజాగా దేశంలో స్థూల ఆర్థిక ప్రమాణాలన్నీ రికవరీ సంకేతాలను చూపుతున్నాయన్నారు. ప్రస్తుత పండుగ సీజన్‌.. ఆర్థిక వ్యవస్థలో మరింత జోరు పెంచిందని.. మూడు, నాలుగు త్రైమాసికాల్లో సానుకూల వృద్ధిపై ఆశలు పెంచిందని చెప్పారు. ఇదిలాగే కొనసాగితే వచ్చే యేడాదికి జీడీపీ ( GDP ) పుంజుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. Also read: COVID-19 Recovery Rate: ఇండియాలో 90.62 శాతానికి రికవరీ రేటు

Read More