Home> జాతీయం
Advertisement

త్వరలో తగ్గనున్న ఇంధన ధరలు, చమురు నిల్వలు తీసేందుకు కేంద్రం నిర్ణయం

Fuel Prices: రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు గణనీయంగా తగ్గే పరిస్థితి ఉందా అంటే అవుననే తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు యోచిస్తోంది.  ఆ చర్యలేంటో పరిశీలిద్దాం.

త్వరలో తగ్గనున్న ఇంధన ధరలు, చమురు నిల్వలు తీసేందుకు కేంద్రం నిర్ణయం

Fuel Prices: రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు గణనీయంగా తగ్గే పరిస్థితి ఉందా అంటే అవుననే తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు యోచిస్తోంది.  ఆ చర్యలేంటో పరిశీలిద్దాం.

పెట్రోల్-డీజిల్ ధరలు(Petrol-Diesel Prices) గత కొద్దికాలంగా విపరీతంగా పెరిగిపోయాయి. రెండేళ్లలో దాదాపు 40-50 రూపాయలు పెరిగిన పరిస్థితి. ఈ క్రమంలో సామాన్యుడికి, మధ్య తరగతి ప్రజలకు పెను ఇబ్బందిగా మారింది. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం ఇతర ధరలపై పడింది. ఈ క్రమంలో పెట్రోల్-డీజిల్ ధరల తగ్గింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. అదే జరిగితే వాహనదారులకు నిజంగా గుడ్‌న్యూస్ అవుతుంది. 

కేంద్ర ప్రభుత్వం(Central Government) కొద్దిగా ఎక్స్జైజ్ పన్ను తగ్గించినా..వివిధ రాష్ట్రాలు విధిస్తున్న వ్యాట్ తగ్గకపోవడంతో ఇంకా వంద రూపాయలపైనే లీటర్ పెట్రోల్ ధర కొనసాగుతోంది. చాలా రాష్ట్రాల్లో 110 రూపాయలు పెడితే కానీ లీటర్ పెట్రోల్ రాని పరిస్థితి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆలోచన కొత్త ఆశలు రేపుతోంది పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాల్ని కల్పిస్తోంది. అత్యవసర నిల్వల నుంచి దాదాపుగా 50 లక్షల బ్యారెళ్ల ముడి చమురును బయటకు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరల్ని కట్టడి చేసేందుకు ఇప్పటికే అమెరికా, జపాన్ దేశాలు ఇదే పద్ధతి అవలంభిస్తున్నాయి. ఇప్పుడు ఇండియా కూడా అదే వ్యూహాన్ని ఎంచుకోనుందని సమాచారం. 

పెట్రోల్- డీజిల్ ధరల్ని తగ్గించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం(Central government) తాజా ఆలోచనకు రంగం సిద్ధం చేస్తోంది. తూర్పు, పశ్చిమ తీరాల్లోని మూడు ప్రాంతాల్లో ఇండియాకు వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాలున్నాయి. ఇందులో దాదాపు 3.8 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు నిల్వ(Petroleum Reserves of India) ఉంది. రానున్న వారం పదిరోజుల్లో ఈ చమురు నిల్వను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ చమురును మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్, హెచ్‌పీసీఎల్‌కు(HPCL) విక్రయించనున్నారు. వ్యూహాత్మక నిల్వ కేంద్రాలకు ఈ రెండు రిఫైనరీలు అనుసంధానమై ఉన్నాయి. ఇదే జరిగిదే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా తగ్గవచ్చు. త్వరలోనే ఈ అంశంపై అధికారిక ప్రకటన  వెలువడనుంది.

Also read: త్వరలో పూర్తి కానున్న జీల్ - సోనీ విలీన ప్రక్రియ : పునీత్ గోయెంకా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Read More