Home> జాతీయం
Advertisement

Nirbhaya case latest updates | నిర్భయ కేసు దోషులకు ఉరి ఎప్పుడు ..?

నిర్భయ కేసు విచారణ మళ్లీ వాయిదాపడింది. పటియాలా హౌస్ కోర్టులో నేడు కేసు విచారణ జరగాల్సి ఉంది. ఐతే అడిషనల్ సెషన్ జడ్జ్ సతీష్ కుమార్ అరోరా ఈ కేసు విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేశారు. నిర్భయ కేసులో దోషులుగా తేలిన వారికి ఉరి శిక్ష అమలు చేయాలని కోరుతూ ఆమె తల్లిదండ్రులు పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Nirbhaya case latest updates | నిర్భయ కేసు దోషులకు ఉరి ఎప్పుడు ..?

న్యూఢిల్లీ: నిర్భయ కేసు విచారణ మళ్లీ వాయిదాపడింది. పటియాలా హౌస్ కోర్టులో నేడు కేసు విచారణ జరగాల్సి ఉంది. ఐతే అడిషనల్ సెషన్ జడ్జ్ సతీష్ కుమార్ అరోరా ఈ కేసు విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేశారు. నిర్భయ కేసులో దోషులుగా తేలిన వారికి ఉరి శిక్ష అమలు చేయాలని కోరుతూ ఆమె తల్లిదండ్రులు పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఇవాళ వాదనలు వినాల్సి ఉంది. ఐతే ఉన్నట్టుండి విచారణ మళ్లీ ఇలా వాయిదా పడడంతో నిర్భయ తల్లిదండ్రుల్లో నైరాశ్యం నెలకొంది. మరోవైపు డిసెంబర్ 16న నిర్భయ దోషులను ఉరి తీస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నిర్భయ తల్లిదండ్రుల పిటిషన్‌పై విచారణ వాయిదా పడడంతో డిసెంబర్ 16న ఉరి శిక్ష అమలు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. అటు నిర్భయ కేసులో దోషిగా ఉన్న అక్షయ్ కుమార్ సింగ్ గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌ను డిసెంబర్ 17న ముగ్గురు సభ్యుల సుప్రీం ధర్మాసనం విచారించనుంది. 

ఇదిలావుండగా దిశ అత్యాచారం, హత్య కేసులో పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆమెకు న్యాయం జరిగిందని భావిస్తున్నారు. ఐతే నిర్భయ కేసులో ఏడేళ్లయినా ఇప్పటికీ ఆమెకు న్యాయం జరగలేదన్న భావనలో ఉన్నారు. నిర్భయ దోషులకు ఉరి ఎప్పుడు అని ప్రశ్నిస్తున్న పరిస్థితి దేశవ్యాప్తంగా కనిపిస్తోంది.

Read More