Home> జాతీయం
Advertisement

పాకిస్థాన్ బుద్ది మరోసారి బయటపడింది

మరోసారి పాకిస్థాన్ బుద్ది ఏంటో బయటపడింది. జాదవ్ ను కలవడానికి వెళ్లిన అతని భార్య, తల్లికి ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాము అని వాగ్దానం చేసిన పాక్.. 'నా వైఖరిలో మార్పు లేదు' అని షరామామూలుగానే వ్యవహరించింది.

పాకిస్థాన్ బుద్ది మరోసారి బయటపడింది

మరోసారి పాకిస్థాన్ బుద్ది ఏంటో బయటపడింది. జాదవ్ ను కలవడానికి వెళ్లిన అతని భార్య, తల్లికి ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాము అని వాగ్దానం చేసిన పాక్.. 'నా వైఖరిలో మార్పు లేదు' అని షరామామూలుగానే వ్యవహరించింది. జాదవ్ ను కలవడానికి వెళ్లిన తల్లి, భార్యపై పాక్ ఎలా ప్రవర్తించిందో తెలిస్తే.. ఛీ.. ఛీ.. అనేక మానరు. భారత విదేశాంగ శాఖ అక్కడ జరిగిన ఒక్కో సన్నివేశానని కళ్లకు కట్టినట్టు చెప్పారు.

సోమవారం పాకిస్థాన్ లో జాదవ్ ను కలవడానికి తల్లి, భార్య ఇద్దరూ దుబాయ్ కు వెళ్లి.. అక్కడి నుండి పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ కు చేరుకున్నారు. అక్కడి విదేశాంగ కార్యాలయంలో జాదవ్, వారి కుటుంబసభ్యుల మధ్య సమావేశం ఏర్పాటు చేసింది పాక్. తల్లి, భార్య లోనికి వెళ్ళేటప్పుడు మత సంప్రదాయాలకు పాక్ కనీస విలువ ఇవ్వలేదు. చెప్పులు బయటనే వదలమని చెప్పింది. తాళిబొట్టు తీసేయమని చెప్పింది. బొట్టు చెరిపేసుకొమని అంది. గాజులు కూడా తీసేయమంది. బట్టలు మార్చుకొని లోనికి వెళ్లండని పాక్ చెప్పిందని భారత విదేశాంగ ప్రతినిధి రవీష్ కుమార్ అన్నారు.  సమావేశం తర్వాత పాక్ చెప్పులు కూడా తిరిగి ఇవ్వలేదని.. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందనే అనుమానం తమకు కలిగిందని చెప్పారు. లోనికి కుటుంబసభ్యులనే అనుమతించారని చెప్పారు. 

"మేము జాదవ్ ను మానిటర్ నుంచి చూశాం. జాదవ్ కి, వారి కుటుంబసభ్యులకి మధ్య గాజుగోడ అడ్డుగా పెట్టారు. కనీసం తల్లి, భార్య స్పర్శకు కూడా నోచుకోలేదు జాదవ్. ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదనిపించింది. నిర్బంధంలో ఉన్నట్లుగానే కుటుంబసభ్యులతో మాట్లాడారు" అన్నారు.

 

Read More