Home> జాతీయం
Advertisement

UGC NET Cancel: కేంద్రం సంచలన నిర్ణయం.. అవకతవకలతో యూజీసీ నెట్‌ పరీక్ష రద్దు

UGC NET 2024 Exam Cancelled By NTA: దేశంలో విద్యా వ్యవస్థలకు లీక్‌ అంశం పట్టి పీడుస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. యూజీసీ నెట్‌ పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

UGC NET Cancel: కేంద్రం సంచలన నిర్ణయం.. అవకతవకలతో యూజీసీ నెట్‌ పరీక్ష రద్దు

UGC NET 2024 Exam: నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మంగళవారం నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష (నెట్‌)ను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించింది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించడం గమనార్హం. అంతేకాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణకు కూడా ఆదేశించడం విశేషం.

Also Read: Good News: రైతులకు మోదీ 3.0 తొలి కానుక.. వరితోపాటు పంటలకు భారీగా ధరలు పెంపు

జూన్‌ 18వ తేదీన యూనియన్‌ గ్రాంట్స్‌ కమిషన్‌ నెట్‌-2024 పరీక్షను నిర్వహించింది. అయితే నీట్‌ సహా పలు పరీక్షల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే నిర్వహించిన నెట్‌ పరీక్షపై కూడా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నెట్‌ పరీక్షను రద్దు చేస్తూ బుధవారం రాత్రి యూజీసీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1,205 కేంద్రాల్లో జరిగిన నెట్‌ పరీక్షకు దాదాపుగా 9 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. జేఆర్‌ఎఫ్‌, పీహెచ్‌డీ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా అర్హత సాధించేందుకు నెట్‌ పరీక్ష అనేది నిర్వహిస్తారు. అయితే నెట్‌ పరీక్ష రద్దు కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావొచ్చు.

Also Read: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్‌ప్రైజ్.. కొత్త పేకమిషన్‌ ఏర్పాటుపై ప్రతిపాదన.. బేసిక్ పే ఎంతంటే..?

ఈ పరీక్షను రద్దు చేస్తూ పారదర్శకతను కాపాడడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ (విద్య శాఖ) వెల్లడించింది. పరీక్షల పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఇక నీట్‌ పేపర్‌ లీక్‌ అంశంపై కూడా కేంద్రం స్పందించింది. సమయం కోల్పోయిన విద్యార్థులకు కలిపిన గ్రేస్‌ మార్కులు రద్దు చేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేసింది. పాట్నాలో జరిగిన నీట్‌ అవకతవకలపై పోలీసులు విచారణ చేస్తున్నారని పేర్కొంది. అక్కడి అవకతవకలపై బిహార్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపింది.

అభ్యర్థుల ఆగ్రహం
పరీక్ష రద్దుపై అభ్యర్థుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అవకతవకలపై ఆరోపణలు వస్తుంటే పరీక్ష నిర్వహించకుండా ముందే రద్దు చేయొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. నెట్‌ పరీక్ష రద్దు సరే మరి నీట్‌ పరీక్ష రద్దు చేయరా అని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నారు. వైద్య విద్యకు సంబంధించిన కీలకమైన నీట్‌ను రద్దు చేయాలని ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతున్నది. నెట్‌ రద్దు నేపథ్యంలో త్వరలోనే నీట్‌ పరీక్ష కూడా రద్దు ఉంటుందని చర్చ జరుగుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Read More