Home> జాతీయం
Advertisement

Fine for not wearing mask: మాస్కులు ధరించలేదని వేసిన జరిమాన అక్షరాల 86 కోట్ల రూపాయలు

not wearing face masks bmc collects over Rs 86 crore : పబ్లిక్ ప్లేస్‌లలో మాస్క్‌ ధరించని వారి నుంచి భారీ ఎత్తున జరిమానా వసూలు. మాస్క్‌ ధరించని వారి నుంచి రూ. 86 కోట్లు వసూలు చేసింది బీఎంసీ. ముంబైలోనే 69,03,69,971 రూపాయలు వసూలు.

Fine for not wearing mask: మాస్కులు ధరించలేదని వేసిన జరిమాన అక్షరాల 86 కోట్ల రూపాయలు

not wearing face masks bmc collects over Rs 86 crore in fine from people not wearing masks : ప్రస్తుతం దేశంలో కొవిడ్ థర్డ్‌వేవ్‌ ప్రభావం చాలా ఉంది. ఒమిక్రాన్‌ (Omicron) వ్యాప్తితో రోజురోజుకు కొవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మాస్క్‌లు (Masks) ధరించమని ప్రజలకు సూచిస్తున్నాయి. అలాగే సోషల్ డిస్టెన్స్ పాటించమని కోరుతున్నాయి. పలు కొవిడ్ జాగ్రత్తలను (Covid cautions) సూచిస్తున్నాయి.

ఇక కొవిడ్ నిబంధనలు పాటించడం అని ప్రభుత్వాలు, వైద్యాధికారులు హెచ్చరించినా కూడా కొన్ని చోట్ల జనాలు ఈ సూచనలు పెడ చెవిన పెడుతున్నారు. ఇక మహారాష్ట్రలో (Maharashtra) ఇలా నిర్లక్ష్యం చేసే వారిపై అక్కడి ప్రభుత్వం (Government) కఠినంగా వ్యవహరిస్తోంది.

పబ్లిక్ ప్లేస్‌లలో మాస్క్‌ (Mask in public places) ధరించని వారి నుంచి ఇప్పటి వరకు బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ రూ. 86 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు మొత్తం 86 కోట్ల 42 లక్షల 49 వేల 771 రూపాయలు మాస్కు (Mask) ధరించని వారి నుంచి జరిమానా రూపంలో వసూలు చేసింది బీఎంసీ.

Also Read : Dhanush, Aishwaryaa split: ధనుష్​, ఐశ్వర్య విడిపోయారు కానీ.. విడాకులు కాలేదట!

ఇక ఒక్క ముంబైలోనే 69,03,69,971 రూపాయలు వసూలు చేసింది. ముంబై పోలీస్‌, రైల్వే శాఖలు ఈ జరిమానాను వసూలు చేశాయి. ఇక ప్రస్తుతం ముంబైలో (Mumbai) కరోనా (Corona) బాధితుల సంఖ్య 10లక్షలకు పైగా చేరుకుంది. అక్కడ రికవరీ రేటు తొంభైనాలుగు శాతంగా ఉంది.

Also Read : Woman on Burj Khalifa: వామ్మో! బుర్జ్ ఖలీఫాపై నిలబడి.. అడ్వర్టైజ్‌మెంట్ వైరల్ వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Read More