Home> జాతీయం
Advertisement

CAA, NRC: సీఏఏ, ఎన్ఆర్‌సీలతో ఏ ఇబ్బంది లేదు: అజిత్ పవార్

ఎన్డీఏ సర్కార్ తీసుకొచ్చిన సీఏఏపై దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధానాన్ని సంతరించుకున్నాయి.

CAA, NRC: సీఏఏ, ఎన్ఆర్‌సీలతో ఏ ఇబ్బంది లేదు: అజిత్ పవార్

ముంబై: అసెంబ్లీ ఎన్నికల తర్వాత నాటకీయ పరిణామాలు చోటుచేసుకుని చివరికి ఎన్సపీ, శివసేన, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. అయితే ఇతర రాష్ట్రాల మాదిరిగా తాము అంత తేలికగా నిర్ణయాలు తీసుకోలేమని మహారాష్ట్ర డిప్యూజీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు. దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న పౌరసత్వ సవరణ చట్టం (CAA), ఎన్‌ఆర్‌సీ లాంటి విషయాలతో మహారాష్ట్ర ప్రజలకు ఎలాంటి లేదని ఎన్సీపీ నేత అజిత్ పవార్ పేర్కొన్నారు. దీంతో మహారాష్ట్ర అసెంబ్లీ సీఏఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం లేదని తెలుస్తోంది.

రాజస్థాన్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను వ్యతిరేకిస్తూ, తమ రాష్ట్రాల్లో వాటిని అమలు చేయాల్సిన అవసరం లేదంటూ శాసనసభలలో తీర్మానాలు ప్రవేశపెట్టాయి. కాగా, ఈ నాలుగు రాష్ట్రాల్లో కేవలం ఒక పార్టీ అధికారాన్ని చేపట్టి పరిపాలన కొనసాగిస్తుందన్నారు. అయితే మహారాష్ట్రలో పరిస్థితి భిన్నంగా ఉంటుదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సీఏఏ, ఎన్ఆర్‌సీలతో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెప్పారని డిప్యూజీ సీఎం అజిత్ పవార్ గుర్తుచేశారు.

Also Read: సీఏఏకు వ్యతిరేకంగా పది లక్షల మందితో సభ పెడతాం : కేసీఆర్

కాగా, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జనవరి 27న పశ్చిమ బెంగాల్ సైతం తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఈ జాబితాలో నాలుగో రాష్ట్రంగా నిలిచింది. బీజేపీ పాకిస్థాన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోందని ఆ రాష్ట్ర సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన అనంతరం సీఏఏకు వ్యతిరేకంగా భారీగా కార్యక్రమాలు చేపడతానని సీఎం కేసీఆర్ సైతం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More