Home> జాతీయం
Advertisement

నా బడ్జెట్ ప్రసంగం సుదీర్ఘమే కానీ. .

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్  2020-2021 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇవాళ లోక్ సభలో సరిగ్గా 11 గంటలకు ప్రారంభమైన ఆమె బడ్జెట్ ప్రసంగం 2 గంటల 19 నిముషాలు సాగింది. నిజానికి ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని 90 నిముషాల్లో పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఆమె బడ్జెట్ ప్రసంగం సుదీర్ఘంగా సాగింది.

నా బడ్జెట్ ప్రసంగం సుదీర్ఘమే కానీ. .

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్  2020-2021 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇవాళ లోక్ సభలో సరిగ్గా 11 గంటలకు ప్రారంభమైన ఆమె బడ్జెట్ ప్రసంగం 2 గంటల 19 నిముషాలు సాగింది. నిజానికి ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని 90 నిముషాల్లో పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఆమె బడ్జెట్ ప్రసంగం సుదీర్ఘంగా సాగింది. దీనిపై ఆమె బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడినప్పుడు వివరణ ఇచ్చారు. మరోవైపు ఇప్పటి వరకు చరిత్రలో ఇంతటి సుదీర్ఘమైన బడ్జెట్ ఎప్పుడూ చూడలేదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. మొత్తంగా  చూసుకున్నా కేంద్ర బడ్జెట్ లో పేదలకు ఒరిగిందేమీ లేదని చెప్పారు. 

బడ్జెట్ ప్రసంగం సుదీర్ఘంగా సాగిన విషయాన్ని ప్రెస్ మీట్ లో విలేకరులు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఆమె .. తన బడ్జెట్ స్పీచ్ కాస్త సుదీర్ఘంగానే సాగిందని ఒప్పుకున్నారు. ఐతే తాను ప్రభుత్వ సంక్షేమ పథకాలు, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన లాంటి అంశాలపై కాస్త ఎక్కువ సేపు మాట్లాడానని తెలిపారు. వారికి ఎలాంటి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తుందో చెప్పుకొచ్చినట్లు వివరించారు. 

Read More