Home> జాతీయం
Advertisement

Ram Nath Kovind: రాష్ట్రపతికి చేరిన నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్

నిర్భయ కేసు దోషులలో ఒకరైన ముకేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వద్దకు చేరింది. గురువారం (జనవరి 16) రాత్రి ముకేశ్ పిటిషన్‌ను రాష్ట్రపతి భవన్‌కు పంపించినట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది.

Ram Nath Kovind: రాష్ట్రపతికి చేరిన నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిర్భయ కేసు దోషుల ఉరిశిక్షకు రోజులు దగ్గర పడుతున్నాయి. ఈ క్రమంలో నలుగురు దోషులలో ఒకరైన ముకేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వద్దకు చేరింది. గురువారం (జనవరి 16) రాత్రి ముకేశ్ పిటిషన్‌ను రాష్ట్రపతి భవన్‌కు పంపించినట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది. ఆ పిటిషన్‌ను తిరస్కరించాలని సైతం హోంమంత్రిత్వశాఖ కోవింద్‌కు సిఫార్సు చేసింది.

Also Read: ఈ 22న నిర్భయ దోషులకు ఉరి. ఎవరీ పవన్ జల్లాద్?

జనవరి 22న ఉదయం 7 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ కొన్ని రోజుల కిందట ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరు దోషులు క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేసుకోగా ఎన్వీ రమణ ధర్మాసనం వాటిని తిరస్కరించింది. అనంతరం దోషుల్లో ఒకడైన ముకేశ్ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. 

తొలుత ఢిల్లీ ప్రభుత్వం ఆ పిటిషన్‌ను తిరస్కరించాలని లెఫ్టినెంట్ గవర్నర్‌కు సిఫార్సు చేసింది. దాన్ని ఆమోదించిన లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర హోంశాఖకు పిటిషన్‌ను పంపుతూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. గురువారం రాత్రి రాష్ట్రపతి కోవింద్‌కు క్షమాభిక్ష పిటిషన్‌ను కేంద్ర హోంశాఖ పంపంచింది. ఆ పిటిషన్‌ను తిరస్కరించాలని కేంద్ర హోంశాఖ కార్యాలయం సూచించినట్లు సమాచారం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More