Home> జాతీయం
Advertisement

Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా క్యాంప్‌బెల్ విల్సన్, ఎవరీ క్యాంప్‌బెల్ ?

Air India New CEO: టాటా చేతికి చిక్కిన ఎయిర్ ఇండియాకు కొత్త సీఈవో వస్తున్నాడు. విమానయాన రంగంలో విశేష అనుభవం కలిగిన విదేశీయుడిని సీఈవో టాటా సంస్థ ఎంపిక చేసింది. రెగ్యులేటరీ అనుమతులు పూర్తయితే..ఇక బాథ్యతలు లాంఛనమే...
 

Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా క్యాంప్‌బెల్ విల్సన్, ఎవరీ క్యాంప్‌బెల్ ?

Air India New CEO: టాటా చేతికి చిక్కిన ఎయిర్ ఇండియాకు కొత్త సీఈవో వస్తున్నాడు. విమానయాన రంగంలో విశేష అనుభవం కలిగిన విదేశీయుడిని సీఈవో టాటా సంస్థ ఎంపిక చేసింది. రెగ్యులేటరీ అనుమతులు పూర్తయితే..ఇక బాథ్యతలు లాంఛనమే...

నష్టాల బాటలో ఉన్న ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ ఇటీవలే కొనుగోలు చేసింది. సంస్థను అభివృద్ధి పథాన నిలిపేందుకు టాటా గ్రూప్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా విమానయాన రంగంలో విశేష అనుభవం కలిగిన న్యూజిలాండ్‌కు చెందిన క్యాంప్‌బెల్ విల్సన్‌ను ఎయిర్ ఇండియా కొత్త సీఈవో మరియు ఎండీగా టాటా గ్రూప్ ఎంపిక చేసింది. ఈ నియామకాన్ని ఎయిర్ ఇండియా బోర్డు ఇప్పటికే ఆమోదించగా..ఇంకా రెగ్యులేటరీ అనుమతులు రావల్సి ఉన్నాయి.

క్యాంప్‌బెల్ విల్సన్ నేపధ్యం

న్యూజిలాండ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ కాంటర్‌బరీ నుంచి కామర్స్‌లో మాస్టర్స్ చేసిన క్యాంప్‌బెల్ విల్సన్‌కు వైమానిక రంగంలో 26 ఏళ్ల అనుభవముంది. జపాన్, కెనడా, హాంకాంగ్ దేశాల్లో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో 15 సంవత్సరాలు పనిచేశారు. టాటా సంస్థ ఆధీనంలో ఉన్న విస్తారా ఎయిర్‌లైన్స్‌కు భాగస్వామిగా ఉన్న సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా విల్సన్ కెరీర్ ప్రారంభమైంది. 2011లో స్కూట్ విమానయాన సంస్థ సీఈవోగా చేసి..తిరిగి 2016లో సింగపూర్ ఎయిర్‌లైన్స్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. 2020లో తిరిగి స్కూట్ ఎయిర్‌లైన్స్ సీఈవోగా చేశారు. 

లోకాస్ట్ ఎయిర్‌లైన్స్‌పై విశేష అనుభవం, అవగాహన విల్సన్‌కు సానుకూలాంశాలుగా ఉన్నాయి. ఆసియా ఖండంలో ఎయిర్‌లైన్స్ బ్రాండ్ విస్తరింపజేయడంలో మంచి అనుభవం ఉందనేది టాటా ఎయిర్ ఇండియా ఆలోచనగా ఉంది. విల్సన్ కంటే ముందు..టర్కిష్ ఎయిర్‌లైన్స్ సీఈవో ఐకార్‌ను సీఈవోగా పరిశీలించినా..ఆయన ఈ ఆఫర్ తిరస్కరించారు. తరువాత విల్సన్ పేరు పరిశీలించి..ఆమోదించింది. రెగ్యులేటరీ అనుమతులు వస్తే..త్వరలో కొత్త సీఈవోగా విల్సన్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Also read: Early Monsoon: ఈసారి ముందస్తు రుతుపవనాలు, వర్షాలూ అధికమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More