Home> జాతీయం
Advertisement

JN.1 variant cases: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్.. 500 దాటిన జేఎన్.1 కేసులు..

JN.1 variant cases: దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ విజృంభిస్తోంది. తాజాగా జేఎన్. 1 కేసులు 500 మార్కును క్రాస్ చేశాయి. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేలు దాటింది. 
 

JN.1 variant cases: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్.. 500 దాటిన జేఎన్.1 కేసులు..

New Covid-19 infections in India: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.  గడిచిన 24 గంటల్లో కొత్తగా 760 కొత్త కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. వైరస్ తో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కేరళ మరియు కర్ణాటకల్లో ఒక్కొక్కటి చొప్పున మరణాలు చోటుచేసుకున్నాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 4,423 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య  4,50,15,896కి చేరగా.. మరణాల సంఖ్య 5,3337 కు పెరిగింది. దేశంలో రికవరీ రేటు 98.81 శాతం ఉంది. ఇప్పటి వరకు 220.67 కోట్ల కరోనా వ్యాక్సిన్లు అందించారు. . దేశవ్యాప్తంగా జనవరి 3న మొత్తం 5, 31,342 కరోనా టెస్టులు చేశారు. 

మరోవైపు కరోనా కొత్తవేరియంట్ అయిన జేఎన్. 1 కేసులు భారీగా పెరుగుతున్నాయి. డిసెంబరు 28 వరకు 145 JN.1 సబ్‌వేరియంట్ కేసులు ఉండగా.. తాజాగా ఆ కేసులు 511కి పెరిగాయి. మొత్తం 11 రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగు చూశాయి. ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే అత్యధికంగా 199 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత కేరళలో 148 కేసులు, గోవాలో 47, గుజరాత్‌లో 36, మహారాష్ట్రలో 32, తమిళనాడులో 26, ఢిల్లీలో 15, రాజస్థాన్‌లో నాలుగు, తెలంగాణలో రెండు, ఒడిశా, హర్యానాలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.

మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ రిలీజ్ చేసిన డేటా ప్రకారం, డిసెంబరు 16 నాటికి 41 దేశాల్లో 7,344 జేఎన్.1 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన జేఎన్. 1పై కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.  ఇప్పటి వరకు పరిశీలించిన దాని ప్రకారం, కొత్త వేరియంట్ ప్రభావం కాస్త తక్కువగానే ఉన్నట్లు డబ్ల్యూహెచ్వో తెలిపింది. దేశంలో డిసెంబర్ 5 వరకు డబుల్ డిజిట్స్ కే పరిమితమైన కరోనా కేసులు.. ఇప్పుడు వేలల్లోకి వచ్చేశాయి. వింటర్ సీజన్ కావడంతో కరోనా వ్యాప్తి పెరుగుతుంది. 

Also Read: JN.1 scare: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్.. కొత్త కేసులు ఎన్నంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More