Home> జాతీయం
Advertisement

మైనార్టీలకు 12% రిజర్వేషన్ ప్రతిపాదన: కేసీఆర్‌కి ప్రధాని మోదీ సూటి ప్రశ్న!

మైనార్టీలకు 12% రిజర్వేషన్ ప్రతిపాదనపై స్పందించిన మోదీ 

మైనార్టీలకు 12% రిజర్వేషన్ ప్రతిపాదన: కేసీఆర్‌కి ప్రధాని మోదీ సూటి ప్రశ్న!

మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కృషిచేస్తామని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రతిపాదనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే సుప్రీం కోర్టు ఒక పరిమితిని విధించిందని, కొత్తగా రిజర్వేషన్లు కల్పించే వీలు లేని పరిస్థితుల్లోనూ మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ చెబుతున్నారంటే అది ఎలా సాధ్యం అని మోదీ ప్రశ్నించారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం ఇంకా కొత్తగా రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం లేనప్పుడు మైనార్టీలకు రిజర్వేషన్ ఇవ్వడం కోసం ఎస్సీలు, ఎస్టీలకు రాజ్యంగం కల్పించిన రిజర్వేషన్ల కోటాను తగ్గించాలని కేసీఆర్ యోచిస్తున్నారా అని కేసీఆర్‌కు ప్రశ్నలు సంధించారు. ఇవన్నీ తెలిసి కూడా కేసీఆర్ పదేపదే రిజర్వేషన్ల గురించి చెబుతున్నారంటే అది కేవలం మోసపూరితమైన ఓటు బ్యాంకు రాజకీయమే తప్ప మరొకటి కాదని మోదీ స్పష్టంచేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు హైదరాబాద్ వచ్చిన మోదీ.. ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో పాల్గొని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఓటు బ్యాంకు రాజకీయాలతో అభివృద్ధిని సాధించలేరని, నిజాయితీతో కూడిన రాజకీయాలే ప్రజల భవితవ్యాన్ని మారుస్తాయని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు.

Read More