Home> జాతీయం
Advertisement

నరేంద్రమోదీ '1బి' ప్లాన్

100 కోట్ల ఆధార్ నంబర్లతో 100 కోట్ల బ్యాంకు ఖాతాలకు అనుసంధానం, 100 కోట్ల మొబైల్స్ లింకింగ్.. ఇదే మోదీ నెక్స్ట్ ప్లాన్.

నరేంద్రమోదీ '1బి' ప్లాన్

భారత ప్రధాని నరేంద్రమోదీ మరోకొత్త సంస్కరణకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ఈజ్ ఆఫ్ బిజినెస్ లో భారత్ 30 ర్యాంకులు పైకి ఎగబాకడం, మూడీస్ సంస్థ ఇచ్చిన రేటింగ్ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఈ కొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. 

ఇప్పటికే నోట్లరద్దు, జీఎస్టీ లాంటి సంస్కరణలతో దూసుకుపోతున్న కేంద్రం.. కొత్తగా ఆధార్ అనుసంధానంపై మరో ప్రటకన చేయనుంది. ఆ సంస్కరణ పేరు 1బి+1బి+1బి కనెక్టివిటీ. అంటే 100 కోట్ల ఆధార్ నంబర్లతో 100 కోట్ల బ్యాంకు ఖాతాలకు అనుసంధానం, 100 కోట్ల మొబైల్స్ లింకింగ్ అన్నమాట. పెద్ద నోట్ల రద్దు తరువాత డిజిటల్ లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు పుంజుకోవడంతో ప్రభుత్వం ఈ లక్ష్యానికి చేరువ కావాలని యోచిస్తోంది. ఇంకా దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. తొందరలోనే ప్రకటించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

Read More