Home> జాతీయం
Advertisement

Mumbai Police: కంగనా, రంగోలీలకు మూడోసారి నోటీసులు

రెండు వర్గాల మధ్య విద్వేశాలను రెచ్చగొడుతున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ ( Kangana Ranaut) పాటు ఆమె సోదరి రంగోలి చందేల్‌పై ముంబై పోలీసులు ( Mumbai Police) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ.. వారిద్దరికీ ముంబై పోలీసులు మూడోసారి నోటీసులు జారీ చేశారు.

Mumbai Police: కంగనా, రంగోలీలకు మూడోసారి నోటీసులు

Mumbai Police 3rd time summons Kangana Ranaut and Rangoli: ముంబై: రెండు వర్గాల మధ్య విద్వేశాలను రెచ్చగొడుతున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ ( Kangana Ranaut) పాటు ఆమె సోదరి రంగోలి చందేల్‌పై ముంబై పోలీసులు ( Mumbai Police) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ.. వారిద్దరికీ ముంబై పోలీసులు మూడోసారి నోటీసులు జారీ చేశారు. నవంబరు 23, 24 తేదీల కల్లా బాంద్రా స్టేషన్‌కు హాజరై వివరణ ఇవ్వాలని పోలీసులు కంగనా, రంగోలీలకు పోలీసులు తాజాగా ఆదేశాలిచ్చారు. అయితే పోలీసులు గతంలో రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. రెండోసారి 10 కల్లా పోలీస్ స్టేషన్‌లో హాజరై వివరణ ఇవ్వాలని కోరగా.. ఆమె సోదరుడి వివాహం కారణంగా నవంబరు 15వరకు కంగనా, చందేల్ హాజరు కాలేరని న్యాయవాది బదులిచ్చారు. ఈ మేరకు తాజాగా బుధవారం నోటీసులు జారీ చేశారు. Also read: Adipurush latest update: ఆదిపురుష్ మూవీ నుంచి మరో అప్‌డేట్

అయితే కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్ సోషల్ మీడియాలో మత విద్వేశాలను రెచ్చగొడుతున్నారంటూ ఫిర్యాదు చేయగా.. పోలీసులు తన ఫిర్యాదును నమోదు చేయలేదంటూ మున్నవారలి అకసాహిల్ అష్రాఫలి సయ్యద్ బాంద్రా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన బాంద్రా కోర్టు వారిద్దరిపై కేసు నమోదు చేయాలని ముంబై పోలీసులను ఆదేశించింది. అంతకుముందు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తుమకూరు కోర్టు ఆదేశాల మేరకు కంగనాపై ఎఫ్‌ఐఆర్ దాఖలైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నాటినుంచి కంగనా రనౌత్ బాలీవుడ్, మహారాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం ఘాటైన కామెంట్స్ చేస్తూ వస్తోంది. Also read: Delhi High Court on Chhath Puja: ఇదెలా సాధ్యమంటూ కోర్టు విస్మయం

 

Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు

Also read : How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Read More