Home> జాతీయం
Advertisement

Pradhan Mantri Ujjwala Yojana: గుడ్ న్యూస్.. LPG సిలిండర్ పై సబ్సిడీ రూ.300కి పెంపు

ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఎంతటి విజయవంతమైన పథకమో మన అందరికి తెలిసిందే. అయితే LPG గ్యాస్ సిలిండర్ పై వచ్చే సబ్సిడీ ని రూ. 200 నుండి రూ. 300 వరకు పెంచినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

Pradhan Mantri Ujjwala Yojana: గుడ్ న్యూస్..  LPG సిలిండర్ పై సబ్సిడీ రూ.300కి పెంపు

Pradhan Mantri Ujjwala Yojana: భారత ప్రభుత్వం సామాన్యులకు శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు సబ్సిడీని రూ.300కు పెంచుతున్నట్లు కేంద్ర కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ క్యాబినెట్ నిర్ణయాలపై బ్రీఫింగ్ సందర్భంగా సబ్సిడీని పెంచుతున్నట్లు వెల్లడించారు. ప్రధాని మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఎల్‌పిజి సిలిండర్‌కు రూ. 200 సబ్సిడీ ఇస్తుంది. ఇక నుండి రూ. 200 సబ్సిడీని రూ.300కు పెంచుతున్నట్లు ప్రకటించింది. 

ఈ ఏడాది ఆగస్టులో డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్‌పై రూ. 200 సబ్సిడీని ఆమోదించగా.. ఉజ్వల పథకం లబ్ధిదారులకు ప్రస్తుతం ఉన్న సబ్సిడీని కూడా రూ.200 పెంచిన సంగతి తెలిసిందే!

పీఎంయూఐ అనే సాంఘిక సంక్షేమ పథకం విజయవంతమైన పథకం. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 2016 వ సంవత్సరంతో పోలుచుకుంటే దేశంలో LPG గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని 62% పెంచింది. ప్రధాన మంత్రి ఉజ్వల పథకాన్ని పొడిగించాలన్న అంశాన్ని సెప్టెంబర్ నెలలో కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరం నుండి 2025-26 వరకు మూడు సంవత్సరాలలో 75 లక్షల LPG ఒక్కో కనెక్షన్‌కు

Also Read: Poco M5 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో POCO M5 మొబైల్‌పై 50 శాతం తగ్గింపు..ఈ హాట్‌ డీల్‌ మీ కోసమే..

కింది రేట్ల ప్రకారం కేటాయిస్తే దీని కోసం రూ.1650 కోట్లు ఖర్చు అవుతుంది

14.2 కిలోల సింగిల్ బాటిల్ కనెక్షన్ - ఒక్కో కనెక్షన్‌కు రూ.2200

5 కిలోల డబుల్ బాటిల్ కనెక్షన్ - ఒక్కో కనెక్షన్‌కు రూ.2200

5 కిలోల సింగిల్ బాటిల్ కనెక్షన్ - ఒక్కో కనెక్షన్‌కు రూ.1300

ప్రస్తుత ఉజ్వల 2.0 యొక్క పద్ధతుల ప్రకారం.. ఉజ్వల లబ్ధిదారులకు మొదటి రీఫిల్ & స్టవ్ కూడా ఉచితంగా అందించబడుతుంది.

Also Read: Airtel vs Jio Plans: రిలయన్స్ జియో వర్సెస్ ఎయిర్‌టెల్ 299 ప్లాన్ ప్రయోజనాలు ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Read More