Home> జాతీయం
Advertisement

రాహుల్‌ను విమర్శించినందుకు బీఎస్పీ కీలక నేతపై వేటు

  రాహుల్ గాంధీ విషయంలో నోరుపారేసుకున్న బీఎస్పీ నేత జైప్రకాశ్ సింగ్ తగిన మూల్యాం చెల్లించుకోవాల్సి వచ్చింది.

రాహుల్‌ను విమర్శించినందుకు బీఎస్పీ కీలక నేతపై వేటు

ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విషయంలో నోరుపారేసుకున్న బీఎస్పీ నేత జైప్రకాశ్ సింగ్ తగిన మూల్యాం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆయనపై వేటు వేస్తూ ఆ పార్టీ చీఫ్ మాయవతి సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన  మీడియా సమావేశంలో మాయావతి ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు. 

ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ జైప్రకాశ్ సింగ్ పార్టీ సిద్ధాంతాలు, నిబంధనలకు విరుద్ధంగా సింగ్ మాట్లాడారని.. అందుకే ఆయనపై వేటు వేశామని తెలిపారు. రాహుల్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని..ఈ  విషయంలో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. క్షమ శిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారికైనా ఇదే గతి పడుతుందని మాయావతి వార్నింగ్ ఇచ్చారు. తాజా నిర్ణయంతో బహుజన సమాజ్ పార్టీ వైస్ చైర్ పర్సన్, జాతీయ సమన్వయకర్త  జైప్రకాశ్ సింగ్ తన పదవులను పోగొట్టుకున్నారు. 

ఇటీవలే మీడియా సమావేశంలో జైప్రకాశ్ సింగ్  మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రధాని పదవికి పనికి రారని తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం బీఎస్పీ చీఫ్ మాయవతి..కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా మెలుగుతున్నారు.. ఈ క్రమంలో సింగ్   వ్యాఖ్యలతో ఇరు పార్టీల సంబంధాలపై ప్రభావం చూపే అవకాశమున్న నేపథ్యంలో మామవతి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Read More