Home> జాతీయం
Advertisement

మనం ఆవిష్కరించే పటేల్ విగ్రహం.. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే రెండు రెట్లు పెద్దది - నరేంద్ర మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ 49వ ఎడిషన్‌లో దేశ ప్రజలతో రేడియో ద్వారా తన ఆలోచనలను పంచుకున్నారు.

మనం ఆవిష్కరించే పటేల్ విగ్రహం.. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే రెండు రెట్లు పెద్దది - నరేంద్ర మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ 49వ ఎడిషన్‌లో దేశ ప్రజలతో రేడియో ద్వారా తన ఆలోచనలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ని ఎంతగానో కొనియాడారు. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశాన్ని మొత్తం ఏకతాటిపై తీసుకొచ్చిన ఘనత ఆ మహనీయునిదేనని తెలిపారు. ఆయనకు ఘన నివాళులు అర్పించేందుకే "రన్ ఫర్ యూనిటీ" పేరుతో వైవిధ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని.. దేశ యువత ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మోదీ తెలిపారు. "ఈ సంవత్సరం వచ్చే సర్దార్ పటేల్ జయంతికి ఓ ప్రత్యేకత ఉంది.

నర్మదా నదీ తీరంలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే రెండింతలు ఎక్కువ ఎత్తున్న సర్దార్ పటేల్ విగ్రహాన్ని  ఆవిష్కరిస్తున్నాం. ఆ విగ్రహాన్ని జాతికి అంకితమిస్తున్నాం. ఆ విధంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాం" అని తెలిపారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మోదీ అసువులు బాసిన భారత జవాన్ల కుటుంబాలకు తాను సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. ఫీల్డ్ మార్షల్ శ్యాం మానిక్ షా ఇంటర్వ్యూ తాను చూశానని.. ధైర్య సాహసాలకు ప్రతీకలు భారత జవాన్లని తెలిపారు. 

"ఈ సంవత్సరం నవంబరు 11వ తేదిన మొదటి ప్రపంచ యుద్ధం జరిగి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ యుద్ధంలో మన సైనికులు కూడా పాల్గొన్నారు. అసువులు బాసారు. పోరాటాల విషయానికి వస్తే తాము కూడా ఎవరికీ తీసిపోమని చెప్పారు" అని మోదీ తెలిపారు. అలాగే భారత క్రీడాకారులపై కూడా మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆసియా క్రీడలు, ఆసియా పారా గేమ్స్‌లో భారత క్రీడాకారులు చాలా మెరుగైన ప్రదర్శన కనబరిచి అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపారు. అలాగే ఒడిశాలో త్వరలో ప్రారంభం కానున్న హాకీ వరల్డ్ కప్‌లో కూడా భారత్ సత్తా చాటుతుందనే ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. 

Read More