Home> జాతీయం
Advertisement

Bihar: 10 మందిని చంపి తిన్న పెద్ద పులి.. కాల్చి చంపిన షార్ప్ షూటర్లు..

Bihar Man eater tiger: బీహార్‌లోని చంపారన్ జిల్లాలో మనుషుల రక్తానికి రుచి మరిగిన పెద్దపులిని ఎట్టకేలకు అధికారులు మట్టుబెట్టారు. పది మందిని పొట్టనబెట్టుకున్న ఈ పెద్ద పులిని షార్ప్‌ షూటర్లు కాల్చి చంపారు. 
 

Bihar: 10 మందిని చంపి తిన్న పెద్ద పులి.. కాల్చి చంపిన షార్ప్ షూటర్లు..

Bihar Man eater tiger: బీహార్‌లోని చంపారన్ జిల్లాలో నరమాంస భక్షక పులిని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ శనివారం కాల్చి చంపింది. T-104గా గుర్తించబడిన ఈ పులి ఇప్పటికే పది మందిని పొట్టనబెట్టుకుంది. మనుషుల రక్తాన్ని రుచి మరిగిన ఈ పెద్దపులిని మట్టుబెట్టడానికి 400 మందితో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు అధికారులు. ఆ ఆపరేషన్ బాధ్యతను హైదరాబాద్‌కు చెందిన రెస్క్యూ టీం, పాట్నాకు చెందిన మరొకరికి అప్పగించారు. ఈ పులికి సుమారు 3.5 సంవత్సరాల వయస్సు ఉంటుంది. సెప్టెంబరు 12 నుండి ఈ పులి మనుషులను చంపుతుంది. 

చంపారన్‌ జిల్లాలోని బగాహ అనే గ్రామంపై పడి.. పులి గ్రామస్థులను చంపితినేది. ఇప్పటి వరకు 10 మందిని హతమార్చింది. దీంతో గ్రామస్తులు పులి ఎప్పుడు దాడి చేస్తోందననే భయంతో ఇళ్లలోనే ఉండేవారు. రానూ రానూ మనుషుల రక్తానికి రుచి మరిగిన పులి కనబడ్డ వారిపై దాడి చేసి చంపేది. దీంతో ఆందోళన చెందిన గ్రామస్తులు ఎలాగైనా టైగర్ ను పట్టుకోవాలని ఫారెస్టు అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో రంగంలో దిగిన అటవీ సిబ్బంది పులిని బంధించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. చివరకు ఏనుగులతో కూడా గాలించారు. అయినా ఆ పులి పట్టుబడలేదు. చివరకు బీహర్ ప్రభుత్వం అనుమతి తీసుకుని షార్ప్‌ షూటర్లను తీసుకొచ్చి పులిని చంపించారు. బీహార్‌లోని వాల్మీకి టైగర్ రిజర్వ్ లో 40 పులుల ఉన్నాయి.

Also Read: Peacock Flying Video: ఇంత అందంగా ఎగిరే నెమలిని ఎప్పుడైనా చూశారా.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More