Home> జాతీయం
Advertisement

Devendra Fadnavis: మహారాష్ట్ర మాజీ సీఎం భద్రత కుదింపు

మహారాష్ట్ర మహా వికాస్ అగాఢి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) పాటు ఆయన కుటుంబానికి భద్రతను తగ్గించింది.

Devendra Fadnavis: మహారాష్ట్ర మాజీ సీఎం భద్రత కుదింపు

Maharashtra Govt slashes Devendra Fadnavis security cover | ముంబై: మహారాష్ట్ర మహా వికాస్ అగాఢి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) పాటు ఆయన కుటుంబానికి భద్రతను తగ్గించింది. అలాగే.. ఎంఎన్‌ఎస్‌ అధ్యక్షుడు రాజ్‌ థాకరే, యూపీ మాజీ గవర్నర్‌ రామ్‌ నాయక్‌, రాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్, మాజీ సిఎం నారాయణ్ రాణే, సుధీర్ ముంగంటివార్లతో సహా కొంతమంది నాయకుల భద్రతను ఉపసంహరిస్తూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే అంతకుముందు ఫడ్నవీస్‌కు జడ్‌-ప్లస్‌ సెక్యూరిటీ ఉండగా.. ఇకపై ఎస్కార్టుతో కూడిన వై-ప్లస్‌ సెక్యూరిటీ మాత్రమే ఉండనుంది. ఆయన కుటుంబసభ్యులకు ఎస్కార్ట్‌తో సహా ఎక్స్ కేటగిరికీ తగ్గించారు. 

ఇదిలాఉంటే.. మహారాష్ట్ర ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి చర్యలు తనను ప్రజలను కలవకుండా అడ్డుకోలేవని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలను ఆధారంగా చేసుకుని మహారాష్ట్ర ప్రభుత్వం నేతలకు భద్రత కల్పిస్తోందని విమర్శించారు. (Maharashtra) ప్రభుత్వం కావాలనే ఇలాంటి చర్యలకు పూనుకుంటుందని ఫడ్నవీస్ తెలిపారు. Also Read: Maharashtra: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. పది మంది శిశువుల మృతి

బీజేపీ నేతలపై సంకీర్ణ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని బీజేపీ నేత కేశవ్‌ ఉపాధ్యే మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు పాల్పడడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై మహారాష్ట్ర (Maharashtra Govt) హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ మాట్లాడుతూ.. నేతలకు ఉన్న ముప్పు ఆధారంగానే తాము భద్రతను కల్పిస్తున్నామని, దీనిలో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టంచేశారు. Also read: Covid-19 Vaccine: నేడు సీఎంలతో ప్రధాని మోదీ భేటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More