Home> జాతీయం
Advertisement

Narayan Rane: వచ్చే మార్చికల్లా 'మహా' సర్కార్ కూలిపోతుంది-కేంద్రమంత్రి సంచలనం

Union Minister Narayan Rane sensational comments: మహారాష్ట్రలో వచ్చే మార్చి కల్లా ప్రస్తుత ప్రభుత్వం కూలిపోనుందా... మహా వికాస్ అఘాడీ సర్కార్ స్థానంలో బీజేపీ అధికారం చేపడుతుందా...? కేంద్రమంత్రి నారాయణ్ రాణే చేసిన తాజా సంచలన వ్యాఖ్యలు ఈ చర్చకు ఊతమిస్తున్నాయి.
 

Narayan Rane: వచ్చే మార్చికల్లా 'మహా' సర్కార్ కూలిపోతుంది-కేంద్రమంత్రి సంచలనం

Union Minister Narayan Rane sensational comments: మహారాష్ట్ర సర్కార్‌పై కేంద్రమంత్రి నారాయణ్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలో మహారాష్ట్రలో 'మార్పు' కనిపిస్తుందన్నారు. వచ్చే మార్చి లోపు ఆ మార్పు ఉంటుందన్నారు. ప్రభుత్వాన్ని (Maharashtra Government) ఏర్పాటు చేయాలన్నా లేక ప్రభుత్వాన్ని కూల్చాలన్నా కొన్ని విషయాలు సీక్రెట్‌గా ఉంచాలని అన్నారు. ప్రస్తుతం రాజస్తాన్ పర్యటనలో ఉన్న నారాయణ్ రాణే చేసిన ఈ కామెంట్స్ మహా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

'ప్రస్తుతం సీఎం ఉద్దవ్ థాక్రే (CM Uddhav Thackeray) ఆరోగ్యం బాగా లేదు. ఆయన గురించి ఇప్పుడే ఏమీ మాట్లాడవద్దని మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చెప్పారు. అయితే మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఇక ఎక్కువ రోజులు కొనసాగదు.' అని నారాయణ్ రాణే పేర్కొన్నారు. రెండు వారాల క్రితం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ముంబైలోని (Mumbai) హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో వెన్నెముక సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఇటీవలే సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సీఎం కోలుకుంటున్న నేపథ్యంలో... ఈ గ్యాప్‌లోనే ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కేంద్రమంత్రి నారాయణ్ రాణే (Narayan Rane) తాజా వ్యాఖ్యలు ఇందుకు ఊతమిచ్చేలా ఉన్నాయి.

Also Read: NEET-PG Counselling 2021: రేపటి నుంచి దేశవ్యాప్తంగా రెసిడెంట్ డాక్టర్స్ ధర్నా

ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల కలయికతో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతోంది. భావజాలం పరంగా, రాజకీయంగా చిరకాల మిత్రులుగా ఉన్న బీజేపీ, శివసేనల మిత్రుత్వానికి 2019లో బ్రేక్ పడింది. సీఎం కుర్చీ కోసం శివసేన పట్టుబట్టడం... బీజేపీ అందుకు నిరాకరించడంతో రెండు పార్టీల మిత్రుత్వానికి బ్రేక్ పడక తప్పలేదు. తగిన సంఖ్యా బలం లేకపోవడంతో మూడు రోజులకే ఫడ్నవీస్ (Devendra Fadnavis) సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపు రెండేళ్లు పూర్తి చేసుకున్న మహా వికాస్ అఘాడీ సర్కార్‌ను బీజేపీ నేతలు తరచూ టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మహా వికాస్ అఘాడీ సర్కార్ (Maharashtra) దానికదే కూలిపోతుందని గతంలో మాజీ సీఎం ఫడ్నవీస్ సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా నారాయణ్ రాణే మార్చి లోపు మార్పు ఖాయమని వ్యాఖ్యానించడం మహా రాజకీయాలను హీటెక్కిస్తోంది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో గతంలో చోటు చేసుకున్న అధికార మార్పిడి పరిణామాల రీత్యా మహా రాజకీయాల్లోనూ బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తోందా అన్న చర్చ జరుగుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More