Home> జాతీయం
Advertisement

Maharashtra: లాక్‌డౌన్ మరో 15 రోజులు, మే 31 వరకూ పొడిగింపు

Maharashtra: లాక్‌డౌన్ ఆ రాష్ట్రంలో ఆశించిన ప్రయోజనాల్ని చేకూరుస్తోంది. అందుకే మరికొద్ది రోజులు లాక్‌డౌన్ పొడిగింపుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మే 31 వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగించారు.
 

Maharashtra: లాక్‌డౌన్ మరో 15 రోజులు, మే 31 వరకూ పొడిగింపు

Maharashtra: లాక్‌డౌన్ ఆ రాష్ట్రంలో ఆశించిన ప్రయోజనాల్ని చేకూరుస్తోంది. అందుకే మరికొద్ది రోజులు లాక్‌డౌన్ పొడిగింపుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మే 31 వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగించారు.

దేశంలో కరోనా మహమ్మారి (Corona Virus) నియంత్రణకు చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో అమలు చేస్తున్న లాక్‌డౌన్ సత్ఫలితాలనిస్తోంది. బ్రేక్ ద ఛైన్‌లో భాగంగా విధించిన లాక్‌డౌన్(Lockdown) కొంతమేర సఫలీృతమైంది. కేసుల సంఖ్య నియంత్రణలో ఉంది. దాంతో మరో 15 రోజులు అంటే మే 31 వరకూ లాక్‌డౌన్ పొడిగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray)అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేయాలంటే మరో పదిహేను రోజుల పాటు లాక్‌డౌన్ అవసరమని దాదాపు మంత్రులంతా అభిప్రాయం వెలిబుచ్చారు. రాష్ట్ర ప్రజలంతా కోవిడ్ నిబంధనల్ని పాటించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సూచించారు. భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రపర్చుకోవడం, ముఖాలకు మాస్క్ ధరించడం తప్పనిసరిగా పాటించాలన్నారు.

మరోవైపు వ్యాక్సిన్ కొరత కారణంగా 18-44 ఏళ్లలోపు వయస్సున్నవారికి కరోనా వ్యాక్సిన్ (Vaccination) తాత్కాలికంగా నిలిపివేయాలని కేబినెట్ నిర్ణయించింది. మహారాష్ట్ర(Maharashtra)లోని కొన్ని కేంద్రాల్లోనే 18-44 ఏళ్ల వయస్సున్నవారికి వ్యాక్సిన్ ఇస్తున్నామని..వ్యాక్సిన్ కొరత, సెకండ్ డోస్ ఇవ్వాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రిమండలి వెల్లడించింది.

Also read: West Bengal: రాజీనామా చేసిన ఇద్దరు బీజేపీ ఎంపీలు, కారణం ఏంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More