Home> జాతీయం
Advertisement

ఒక్క రాష్ట్రంలోనే 8,068 కరోనా పాజిటివ్ కేసులు, 342 మంది మృతి

యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ప్రస్తుతం భారత్‌ని గడగడలాడిస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించినా, సరైన అవగాహన లేకున్నా.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే సంకేతాలనిస్తూ పలు రాష్ట్రాల్లో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది.

ఒక్క రాష్ట్రంలోనే 8,068 కరోనా పాజిటివ్ కేసులు, 342 మంది మృతి

న్యూ ఢిల్లీ: యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ప్రస్తుతం భారత్‌ని గడగడలాడిస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించినా, సరైన అవగాహన లేకున్నా.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే సంకేతాలనిస్తూ పలు రాష్ట్రాల్లో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ వ్యాప్తి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి విషయానికొస్తే.. ఇప్పటికే ఆ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 8 వేలు దాటింది. 

Also read: సైకిల్‌పై 3వేల కి.మీ.. హైదరాబాద్‌లో పంక్చర్!

భారత్‌లో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 27,892 కాగా అందులోంచి కేవలం ఒక్క మహారాష్ట్రలోనే 8,068 మంది ఉన్నారు. ఇక భారత్‌లో కరోనా కారణంగా చనిపోయిన మొత్తం మృతుల సంఖ్య 872 కాగా అందులోంచి మహారాష్ట్రలోనే కరోనా మృతుల సంఖ్య 342గా ఉందంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 

Also read : ఆకలిపై యుద్ధం చేద్దాం..!!

మహారాష్ట్రలో మోర్టాలిటీ రేటు 4.24 శాతంగా ఉందని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో ముంబై, పూణె నగరాల్లోనే కోవిడ్-19 కేసులు అధికంగా నమోదయ్యాయి. ముంబై విషయానికొస్తే, ధారావి అనే మురికివాడలోనే కోవిడ్-19 కేసులు అధికంగా నమోదయ్యాయి. ధారావిలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య కూడా అధికంగానే ఉండటం అక్కడి వలసకూలీలను ఆందోళనకు గురిచేస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Read More