Home> జాతీయం
Advertisement

LPG Cylinder Price Hike: సామాన్యులకు మరో షాక్... పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..

LPG Cylinder Price Hike: పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఆయిల్ కంపెనీలు మరో షాకిచ్చాయి. తాజాగా 14 కేజీల ఎల్‌పీసీ సిలిండర్ ధరను పెంచాయి. 

LPG Cylinder Price Hike: సామాన్యులకు మరో షాక్... పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..

LPG Cylinder Price Hike: సామాన్యుడికి ఆయిల్ కంపెనీలు మరోసారి షాక్ ఇచ్చాయి. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను పెంచాయి. 14 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 మేర పెంచేశాయి. పెరిగిన ధరతో సిలిండర్ ధర రూ.1052కి చేరింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి.

ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో ఎల్‌పీసీ సిలిండర్ ధరలు పెంచడం సామాన్యులపై మరో భారం మోపినట్లయింది. చివరిసారిగా, ఈ ఏడాది మార్చి 22న ఆయిల్ కంపెనీలు గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధరను రూ.50 మేర పెంచాయి. దాదాపు నెలన్నర రోజుల తర్వాత మరోసారి ధరలను పెంచాయి. 

ఈ నెల ప్రారంభంలో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు పెంచిన సంగతి తెలిసిందే. 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.102.50 మేర పెంచాయి. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2253 నుంచి రూ.2355.50కి చేరింది. అంతకుముందు, ఏప్రిల్ 11న కమర్షియల్ సిలిండర్ ధర రూ.250, మార్చి 1న రూ.105 మేర పెరిగింది. ఇలా ప్రతీ నెలా ధరలు పెంచుకుంటూ పోతుండటంతో చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా ప్రతీ నెల ప్రారంభంలో ఆయిల్ కంపెనీలు ధరలను సవరిస్తాయి. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. ధరల పెంపుపై సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై రాహుల్ గాంధీ రియాక్షన్ : 

గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో స్పందించారు. కాంగ్రెస్ నేత్రుత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎల్‌పీజీ సిలిండర్ ధర కేవలం రూ.414 మాత్రమే ఉందని గుర్తుచేశారు. ప్రతీ సిలిండర్‌పై రూ.827 సబ్సిడీ ఇచ్చేవారని చెప్పారు. కానీ ఇప్పుడు సిలిండర్ ధర ఏకంగా రూ.999కి చేరిందని... సబ్సిడీ 'జీరో' అని అన్నారు.

సామాన్యుడి రక్షణ కోసం కాంగ్రెస్ కల్పించిన భద్రతను మోదీ ప్రభుత్వం లేకుండా చేసిందన్నారు. ప్రస్తుతం దేశంలో కోట్ల మంది ప్రజలు పేదరికం, నిరుద్యోగం, తీవ్ర ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఇలా జరగనివ్వదని... చేయూత కోరే కుటుంబాలకు తామెప్పుడూ మద్దతుగా నిలుస్తామని చెప్పుకొచ్చారు.  #MehengaiMuktBharat (ధరల పెంపు నుంచి విముక్తి), #BJPFalseIndia హాష్ ట్యాగ్స్‌తో రాహుల్ ఫేస్‌బుక్‌లో తన వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. 

Also Read: KTR Counter to Rahul: పొలిటికల్ టూరిస్టులు వస్తారు, పోతారు.. కానీ కేసీఆర్ లోకల్..

Also Read: Horoscope Today May 7 2022: రాశి ఫలాలు... ఆ రాశి వారికి వివాహ విషయంలో కీలక సూచన... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More