Home> జాతీయం
Advertisement

Bihar Elections: ఎన్డీయే కూటమి నుంచి ఎల్జేపీ వైదొలగనుందా ?

బీహార్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్డీయే కూటమిలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. కూటమి  నుంచి వైదొలగుతామని ఎల్జేపీ హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాయడం సంచలనమవుతోంది.

Bihar Elections: ఎన్డీయే కూటమి నుంచి ఎల్జేపీ వైదొలగనుందా ?

బీహార్ ఎన్నికలకు ( Bihar Election Notification ) నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్డీయే కూటమి ( NDA ) లో లుకలుకలు ప్రారంభమయ్యాయి. కూటమి  నుంచి వైదొలగుతామని ఎల్జేపీ.. హోంమంత్రి అమిత్ షాకు లేఖ ( LJP letter to Amit shah ) రాయడం సంచలనమవుతోంది.

బీహార్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడింది. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 7 వరకూ మూడు దశల్లో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో అధికార, ప్రతిపక్షకూటముల మధ్య సీట్ల పంపకం ప్రారంభమైంది. ప్రతిపక్ష కూటమిగా ఉన్న కాంగ్రెస్-ఆర్జేడీ ( Congress- RJD ) లు ఇప్పటికే ఓ అవగాహన కుదుర్చుకున్నాయి. ఈ కూటమిలో మరి కొన్ని పార్టీలు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరోవైపు అధికార ఎన్డీయే కూటమిలో మాత్రం తలనొప్పులు తప్పడం లేదు. బీజేపీ-జేడీయూ ( BJP-JDU ) ల మధ్య చర్యలు సానుకూలంగానే ఉన్నా..కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ( Central minister Ram vilas paswan ) నేతృత్వంలోని మరో భాగస్వామ్యపార్టీ ఎల్ జే పీ ( LJP ) తో చిక్కు ఎదురవుతోంది. జేడీయూ ప్రతిపాదిస్తున్న 50-50 ఫార్ములా తమకు వర్తింపజేయాలని కోరుతోంది ఎల్ జే పీ. ఈ డిమాండ్లపై జేడీయూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసలు కూటమిలో లేనట్టే భావిస్తున్నామని చెబుతోంది. 

ఈ క్రమంలో జేడీయూ , ఎల్జేపీ మధ్య అంతరం పెరుగుతోంది. ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ ...కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Central home minister Amit shah ) కు లేఖ రాశారు. సీట్ల పంపకంపై నాన్చుడి ధోరణి వద్దని...తమకెన్ని సీట్లు ఇస్తారో తేల్చి చెప్పాలని లేఖలో కోరారు. జేడీయూ నేతలు, కార్యకర్తలతో విసిగిపోయామని..ఇలాగే కొనసాగితే వైదొలగుతామని కూడా స్పష్టం  చేసినట్టు తెలుస్తోంది. తమకు నష్టం జరుగుతున్నప్పుడు కూటమిలో కొనసాగే ప్రసక్తే లేదని చెప్పినట్టు సమాచారం. ఇదే లేఖను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా పంపించారు చిరాగ్ పాశ్వాన్. 

బీహార్ అసెంబ్లీలో 243 స్థానాలున్నాయి. మూడు విడతల్లో జరుగుతున్న ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ అక్టోబర్ 28న జరగనుంది. రెండో విడత పోలింగ్ నవంబర్ 3న జరగనుండగా..మూడో విడత పోలింగ్ నవంబర్ 7 వ తేదీన జరగనుంది. ఇక నవంబర్ 10 వతేదీన ఫలితాలు వెలువడనున్నాయి. Also read: INDIGO: ఇండిగో విమానాన్ని ఢికొన్న పక్షి

Read More