Home> జాతీయం
Advertisement

Droupadi Murmu Oath Live: నా విజయం దేశ ప్రజల విజయం.. భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం.. లైవ్ అప్ డేట్స్

Droupadi Murmu Oath LIVE: భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకారం చేశారు.  ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌లో ద్రౌపది ముర్ముతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ  ప్రమాణం చేయించారు.

Droupadi Murmu Oath Live: నా విజయం దేశ ప్రజల విజయం.. భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం.. లైవ్ అప్ డేట్స్
LIVE Blog

Droupadi Murmu Oath LIVE: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆమెతో ప్రమాణం చేయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 60 ప్రకారం ద్రౌపతి ముర్ముతో ప్రమాణం చేయించారు సీజేఐ. సంప్రదాయ సంతాలీ చీరలో ద్రౌపది ముర్ము ప్రమాణం చేశారు. ముర్ము ప్రమాణస్వీకారానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ముందు వరుసలో కూర్చున్నారు.

25 July 2022
10:39 AM

రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము తొలి ప్రసంగం

వార్డు కౌన్సిలర్ నుంచి రాష్ట్రపతి వరకు వచ్చా

భారత ప్రజాస్వామ్య గొప్పతనం ఇది

వచ్చే 25 ఏళ్లలో దేశం అద్భుతమైన పురోగతి సాధించాలి

అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావాల్సి ఉంది

అందరి సహకారంతో ఉజ్వల యాత్ర కొనసాగుతుంది

 

10:29 AM

రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము తొలి ప్రసంగం

అత్యున్నత పదవికి ఎన్నిక చేసినందుకు ధన్యవాదాలు

మీ విశ్వాసం నిలబెట్టుకునేందుకు కృషి చేస్తా

ఇబ్బందులు ఉన్నా సంకల్ప బలంతో ముందుకు వెళ్లాలి

మీరు నాపై ఉంచిన నమ్మకమే నా బలం

10:14 AM

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం

ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

ప్రమాణ స్వీకారానికి హాజరైన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

09:52 AM

 రాష్ట్రపతి భవన్‌ లో ద్రౌపది ముర్ము

ద్రౌపది ముర్ముకు త్రివిధ దళాల గౌరవ వందనం

 

09:35 AM

రాష్ట్రపతి భవన్ కు చేరుకున్న ద్రౌపది ముర్ము

ముర్ముకు రాంనాథ్ కోవింద్ దంపతుల సాదర స్వాగతం

08:34 AM

రాజ్ ఘాట్ కు వెళ్లిన ద్రౌపది ముర్ము

మహాత్మగాంధీకి ద్రౌపది ముర్ము నివాళి

06:52 AM

భారత రాష్ట్రపతిగా ప్రమాణం చేయబోతున్న తొలి గిరిజన వ్యక్తిగా రికార్డు స్పష్టించిన ద్రౌపది ముర్ముకు  ఆమె తమ్ముడి భార్య అపురూపమైన సంతాలీ చేనేత చీరను బహూకరించారు. ఆ చీరను కట్టుకునే సోమవారం ఆమె ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముర్ము ప్రమాణ కార్యక్రమానికి ఆమె కుటుంబం నుంది సోదరుడు తారిణిసేన్‌ తుడు, ఆయన భార్య సుక్రీ తుడు, ముర్ము కుమార్తె ఇతిశ్రీ, ఆమె భర్త గణేశ్‌ మాత్రమే హాజరు కానున్నారు. చీరతోపాటు ఆమెకు ఇష్టమైన అరిశ పీఠా కూడా తీసుక వెళుతున్నట్లు ద్రౌపది ముర్ము సోదరుడు చెప్పారు.

Read More