Home> జాతీయం
Advertisement

LIC Policy Restart: ఎల్ఐసీ పాలసీ మధ్యలో వదిలేశారా మళ్లీ రీస్టార్ట్ చేయొచ్చు

LIC Policy Restart: సాధారణంగా చాలామంది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుని మధ్యలో వదిలేస్తుంటారు. ప్రీమియం కట్టలేక కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు లేదా మరే ఇతర కారణంతోనైనా పాలసీ డ్రాప్ అవుట్లు చాలా ఉంటాయి. అందుకే ఎల్ఐసీ కొత్త అవకాశం కల్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

LIC Policy Restart: ఎల్ఐసీ పాలసీ మధ్యలో వదిలేశారా మళ్లీ రీస్టార్ట్ చేయొచ్చు

LIC Policy Restart: ఎల్ఐసీ గురించి అందరికీ తెలిసిందే. దేశంలో అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ. విభిన్న వర్గాలకు వివిధ రకాల పాలసీలు అందిస్తుంటుంది. దేశంలో ఎల్ఐసీ పాలసీ తీసుకునేవారి సంఖ్య ఎక్కువే ఉంటుంది. కానీ అదే సమయంలో మధ్యలో వదిలేసేవారుంటారు. ఇక ఇప్పుడు మద్యలో వదిలేసే పాలసీలను కూడా కొనసాగించవచ్చు.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో చాలా పాలసీలు లాంగ్ టర్మ్ ఉంటాయి. ఏదైనా కారణాలతో వరుసగా ప్రీమియం కట్టలేకపోయినా లేదా మరే ఇతర కారణలతోనైనా మద్యలో వదిలేసే పాలసీలు చాలా ఉంటుంటాయి. కారణాలు ఏమైనా కావచ్చు పాలసీ డ్రాప్ అవుట్లు ఎక్కువే ఉంటాయి. ఎల్ఐసీ ఇప్పుడు ఇలాంటి పాలసీలు తిరిగి కొనసాగించే అవకాశం కల్పిస్తోంది. పాలసీ ఎప్పుడు క్లోజ్ అయినా సరే వాటిని మరోసారి రివైజ్ చేసుకునేందుకు అవకాశం లభిస్తోంది. మీరు మధ్యలో వదిలేసిన పాలసీని తిరిగి కొనసాగించాలంటే ఆ పాలసీని రీ స్టార్ట్ చేస్తే సరిపోతుంది.

దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఆ పాలసీకు సంబంధించిన అవుట్ స్టాండింగ్ ప్రీమియంలు అన్నింటినీ వడ్డీతో సహా చెల్లించాలి. పాలసీ రీ స్టార్ట్ చేసేందుకు సమీపంలోని ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లి ఎల్ఐసీ పాలసీ రివిజన్ ప్రక్రియ పూర్తి చేయాలి. దీనికి సంబంధించి ఏమైనా సమస్యలు లేదా సమాచారం అవసరమైతే కస్టమర్ సర్వీస్ నెంబర్‌కు కూడా కాల్ చేసి తెలుసుకోవచ్చు. అవసరమైతే మెడికల్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది.

చాలా సందర్భాల్లో పాలసీ హోల్డర్లు ప్రీమియం కట్టలేకపోతుంటారు. పాలసీ కూడా క్లోజ్ చేయరు. దాంతో అప్పటి వరకూ కట్టిన డబ్బులు ఎల్ఐసీ వద్దే ఉండిపోతాయి. ఇంకొన్ని సందర్భాల్లో పాలసీ హోల్డర్ చనిపోయి నామినీ ఆ డబ్బుల్ని క్లెయిమ్ చేయకపోతే అదంతా అన్ క్లెయిమ్డ్‌గా ఉండిపోతుంది. ఇలాంటి అన్‌క్లెయిమ్డ్ ఎల్ఐసీ పాలసీను చెక్ చేయవచ్చు.

దీనికోసం ఎల్ఐసీ అధికారిక వెబ్‌‌సైట్‌లో వెళ్లాలి. అందులో అన్‌క్లెయిమ్డ్ పాలసీ హోల్డర్స్ సెక్షన్‌లో వెళ్లాలి. ఇప్పుడు మీ ముందు కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో పాలసీ నెంబర్, పాలసీ హోల్డర్ పేరు, పుట్టిన తేదీ, పాన్ నెంబర్ వివరాలు అడుగుతారు. వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేస్తే అక్కడ మీ పాలసీ వివరాలు కన్పిస్తాయి. ఆ డబ్పుల్ని క్లెయిమ్ చేసేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలి.

Also read: ITR Refund Scam: ఐటీఆర్ రిఫండ్ స్కామ్‌తో జాగ్రత్త, లింక్ క్లిక్ చేశారో అంతే సంగతులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More